Lagacharla Incident : వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా కంపెనీ స్థాపనపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ , ఇతర రెవెన్యూ అధికారులపై స్థానికుల దాడి జరిగింది. ఈ దాడిలో అధికారులు ప్రయాణిస్తున్న వాహనాలను రాళ్లతో ధ్వంసం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులపై దాడి జరగడంతో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీ ఈ ఘటన వెనుక బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉందని ఆరోపించింది. స్థానికులను రెచ్చగొట్టి అధికారులపై దాడి చేయించారని కాంగ్రెస్ విమర్శలు చేసింది. బీఆర్ఎస్ నేతల ఆదేశాల మేరకు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తన అనుచరుడు భోగమోని సురేష్‌తో కలిసి ఈ దాడి ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Israel: ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేశాం.. పార్లమెంట్‌లో నెతన్యాహు ప్రకటన
పోలీసుల ప్రకారం, సురేష్ వ్యూహం ప్రకారం అధికారులను తప్పుదోవ పట్టించి లగచర్ల గ్రామానికి తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో గ్రామస్థులు అధికారులపై దాడి చేశారని వివరించారు. లగచర్ల దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డిని ఏ1 నిందితుడిగా, సురేష్‌ను ఏ2 నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన తరువాత నుండి సురేష్ పరారీలో ఉండగా, పోలీసులు అతడి కోసం ముమ్మరంగా గాలించారు. తాజాగా సురేష్ స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోవడం గమనార్హం. సురేష్ లొంగిపోవడంతో లగచర్ల ఘటనపై తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది. పోలీసులు ఆరోపించినట్లుగా సురేష్ ఎవరి పేర్లు బయటపెడతాడు అన్న ఉత్కంఠ నెలకొంది.
Kasthuri: నటి కస్తూరి భర్త, కొడుకు, కూతుళ్ల గురించి తెలుసా?