Site icon NTV Telugu

Warangal Floods: వరంగల్‌లో నీట మునిగిన లేడీస్‌ హాస్టల్.. సాయం కోసం బిల్డింగ్ ఎక్కిన స్టూడెంట్స్..

Warangal Ladies Hostel

Warangal Ladies Hostel

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు వరంగల్ నగరాన్ని ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా వరదలతో నగర వాసులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇళ్లపై నుంచి సహాయం చేయాలని కోరుతున్నారు. ఇక, వరంగల్- హన్మకొండ మధ్య కనెక్టివిటీ పూర్తిగా తెగిపోయింది. అయితే, హంటర్ రోడ్డులోని ఓ లేడీస్ హాస్టల్ లో 200 మంది విద్యా్ర్థినీలు చిక్కుకున్నారు.

Read Also: Minister RK Roja: జగన్ దానకర్ణుడు, చంద్రబాబు కుంభకర్ణుడు.. మంత్రి రోజా కామెంట్స్

అయితే, మరోవైపు వరంగల్‌లోని హంటర్‌ రోడ్డులో వరద బీభత్సం సృష్టించడంతో లేడీస్ హాస్టల్ నీట మునిగింది. హాస్టల్‌లో 200 మందికి పైగా విద్యార్థినులు చిక్కుకున్నారు. సాయం కోసం స్టూడెంట్స్ బిల్డింగ్ ఎక్కారు. రాత్రి నుంచి విద్యార్థినులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరంగల్ నగరంలో నయీం నగర్ దగ్గర వరదలు ఇళ్లను ముంచెత్తాయి. భారీ వాహనాలు కూడ కొట్టుకుపోయాయి. అయితే, నాలా దగ్గర జేసీబీ సహాయంతో కొట్టుకుపోయిన వెహికిల్స్ ను బయటకు తీస్తున్నారు. వరంగల్ నగరానికి చుట్టూ నాలుగు చెరువులున్నాయి.

Read Also: Rajinikanth: మాల్దీవుల్లో తలైవా.. అసలు ఆ వెల్ కమ్ ఏందీ మావా

వరంగల్ నగరంలోని హంటర్ రోడ్డు, నయీం నగర్, శివనగర్ బస్తీల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఈ కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హంటర్ రోడ్డులో వరద భాదితులను రక్షించేందుకు ఎస్‌డీఆర్ఎఫ్, పైర్ సిబ్బంది రంగంలోకి దిగాయి. హంటర్ రోడ్డులో వరదలో చిక్కుకున్న స్థానికులను కాపాడేందుకు స్పీడ్ బోట్ సహాయంతో వెళ్లిన ఎస్ఐ వరద నీటిలో చిక్కుకున్నాట్లు తెలుస్తోంది. ఎస్‌డీఆర్ఎఫ్, సిబ్బంది, పైర్ సిబ్బంది బోట్ల సహాయంతో స్పీడ్ బోటులో చిక్కుకున్న వారిని సేవ్ చేశారు.

Read Also: Asaduddin Owaisi: అవిశ్వాసాన్ని ఆమోదించారు కదా.. స‌భ‌ను న‌డ‌వ‌నివ్వండి: అస‌దుద్దీన్ ఓవైసీ

మరోవైపు.. వడ్డేపల్లి చెరువు పరివాహక ప్రాంతంలో నాలుగు గంటల వ్యవధిలో 20 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో వరంగల్ నగరాన్ని ఈ వరద నీరు ముంచెత్తింది. వరంగల్ రైల్వే స్టేషన్ పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. వరంగల్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో వరదలో చిక్కుకున్నాయి. ఇప్పటికే పునరావాస కేంద్రాల్లో వరద ప్రభావిత వాసులను తరలిస్తున్నారు.

Exit mobile version