Site icon NTV Telugu

Mad Square: ‘లడ్డు గాని పెళ్లి’ లిరికల్‌ సాంగ్ విడుదల.. మాములుగా లేదుగా! వీడియో చూడాల్సిందే

Mad Square 1st Song

Mad Square 1st Song

Mad Square 1st Song Out: ‘టిల్లు స్క్వేర్‌’తో ఘన విజయాన్ని సొంతంచేసుకున్న ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ సంస్థ మరో కొనసాగింపు చిత్రాన్ని పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. గతేడాది విడుదలై విజయవంతమైన ‘మ్యాడ్‌’కి కొనసాగింపుగా.. ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ను రూపొందిస్తోంది. మ్యాడ్‌లో నటించిన నార్నె నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ హీరోలుగా చేస్తున్నారు. కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంను ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్, శ్రీకర స్టూడియోస్‌ సంస్థలతో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Also Read: Koratala Siva: శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ కొరటాల.. ఇది ఓ ఆనవాయితీ!

మ్యాడ్‌ స్క్వేర్‌ నుంచి ఇటీవల ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసిన చిత్ర యూనిట్.. నేడు తొలి గీతాన్ని రిలీజ్ చేసింది. ‘మా లడ్డు గాని పెళ్లి.. ఇగ చూస్కో లొల్లి లొల్లి’ అంటూ సాగే లిరికల్‌ సాంగ్ విడుదల అయింది. ఈ పాటకు కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించగా మంగ్లీ ఆలపించారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సాంగ్ మాములుగా లేదుగా అంటూ కామెంట్స్ వస్తున్నాయి. మ్యాడ్‌ ఎంతగా నవ్వులు పంచిందో.. అందుకు రెట్టింపు స్థాయిలో నవ్వించడమే లక్ష్యంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

Exit mobile version