తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సింగరేణి లో గుర్తింపు కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో పాగా వేయటానికి అటు ఏఐటీయూసీ ఇటు ఐఎన్టీయూసీ పావులు కదుపుతున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్- సీపీఐ పార్టీల అనుబంధ సంఘాలు ఐక్యంగా పోరాడి ఓటమి పాలయ్యారు. అయితే గత రెండు సార్లుగా టీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ గెలుపొందుతూ మూడోసారి హ్యాట్రిక్ కొట్టడానికి ప్రయత్నాలు చేసింది. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం తమ కార్మిక నాయకులకి షాక్ ఇచ్చింది. టీఆర్ఎస్ పార్టీ సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం చేసుకోవడంతో ఆ పార్టీ అనుబంధ సంఘానికి నాయకులైన టీబీజీకేఎస్ నాయకత్వం అంత కూడా ఇప్పుడు కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీలో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర రాజధానిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచర గణంతో చర్చలు జరుపుతుంది.
Read Also: Prashanth Neel: కింగ్ ఖాన్ పైన పగబట్టి.. గురి చూసి కొట్టినట్టుందే!
ఇక, టీబీజీ కేఎస్ కు సంబంధించిన నాయకత్వం అంత కూడా ఇప్పుడు హైదరాబాద్ లో ఉంది. అయితే టీబీజీకేస్ నాయకత్వం మొత్తం గతంలో కాంగ్రెస్ అనుబంధం ఐఎన్టీయుసీలో ఉన్నవారే.. వారంతా టీబీజీకేఎస్ లో చేరి ఆ సంఘాన్ని బలోపేతం చేశారు. రెండు సార్లు గుర్తింపు సంఘంగా గెలుపొందడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు టీబీజీకేఎస్ గుర్తింపు ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం చేసుకోవడంతో ఆ సంస్థ నాయకత్వానికి రాజీనామా చేసిన ఆ సంఘం నాయకులు వెంకట్రావు, రాజిరెడ్డి, మల్లయ్యలు కాంగ్రెస్ లో చేరటానికి రెడీ అయ్యారు. కొత్తగూడెంకు సంబంధించిన పలువురు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సమావేశమయ్యారు.. వీరందరూ కూడా పొంగులేటి సహకారంతో ఐఎన్టీయూసీలో చేరటానికి ప్లాన్ చేసుకుంటున్నారు.
Read Also: Balakrishna: రంగంలోకి దిగిన బాలయ్య.. రెండు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటన
అయితే, టీబీజికేఎస్ కు సంబంధించిన అగ్ర నాయకత్వం అంత కూడా ఐఎన్టిసీలో చేరటానికి సిద్ధం అవుతుండగా.. సీపీఐ అనుబంధ సంస్థ ఏఐటీయూసీ మాత్రం మైన్స్ మీద దృష్టి సారించింది. అసలైన ఓటర్లు ఎక్కడున్నారో వారి దగ్గరికి వెళ్లి అక్కడ టీబీజీకేఎస్ కు సంబంధించిన క్రిందిస్థాయి నాయకత్వంపై దృష్టి సారించింది. క్రింద క్యాడర్ నాయకత్వాన్ని తమ సంస్థలో చేర్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది.