Prithviraj Sukumaran Look From L2 Empuraan: 2019లో సూపర్ స్టార్ మోహన్‌లాల్ కథానాయకుడిగా, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘లూసిఫర్’. ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘లూసిఫర్ 2: ఎంపురాన్’ రాబోతోంది. భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తోంది. తొలి భాగం హిట్ కావటంతో సీక్వెల్‌పై ఎలాంటి అంచనాలున్నాయో ముందుగానే అంచనా వేసిన మేకర్స్.. ఎక్స్‌పెక్టేషన్స్‌ను మించేలా నిర్మిస్తున్నారు.
మోహన్‌లాల్ పుట్టినరోజు సందర్భంగా ‘ఎల్2 ఎంపురాన్’లో ఖురేషి అబ్రమ్‌గా సూపర్ స్టార్ లుక్‌ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు పృథ్వీరాజ్ సుకుమార్ బర్త్ డే సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఖురేషి అబ్రమ్‌కు రైట్ హ్యాండ్‌లా జయేద్ మసూద్ పాత్రలో పృథ్వీరాజ్ కనిపించనున్నారు. తాజాగా రిలీజ్ చేసిన జయేద్ మసూద్ కారెక్టర్ ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఎంపరర్ జనరల్ అంటూ జయేద్ మసూద్ పాత్రను పరిచయం చేశారు. ఈ చిత్రంలో టోవినో థామస్, మంజు వారియర్, నందు, సానియా అయ్యప్పన్ తదితరులు మరోసారి వారి వారి పాత్రలతో మెప్పించబోతున్నారు.
Also Read: Rewind Release Date: అక్టోబర్ 18న ‘రివైండ్’ మూవీ రిలీజ్!
లడఖ్, చెన్నై, కొట్టాయం, అమెరికా, యూకేతో సహా పలుచోట్ల ఎల్2 ఎంపురాన్ చిత్రీకరణ జరిగింది. ప్రస్తుతం తిరువనంతపురంలో షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే గుజరాత్, యూఏఈలో కూడా షూటింగ్ జరుపుకోనుంది. 2025లో మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాను విడుదల కానుంది. లూసిఫర్‌లో మోహన్‌లాల్ స్టీఫెన్ గట్టుపల్లి అనే రాజకీయ నాయకుడిగా కనిపించారు. రాజకీయ నాయకుడు కాకముందు ఈ ప్రపంచాన్నే శాసించే ఓ మాఫియాకు అతడు (అబ్రహాం ఖురేషి) అధినేత. ఓ సాధారణ వ్యక్తిగా జీవితం ప్రారంభించిన స్టీఫెన్.. అబ్రహాం ఖురేషి ఎలా అయ్యాడు?, అతడు చేసిన పనులు ఏంటి?, ఎందుకు రాజకీయ నాయకుడిలా మారాల్సి వచ్చింది?, మసూద్ (పృథ్వీరాజ్)తో పరిచయం ఎలా ఏర్పడింది? అనేవి తెలియాలంటే లూసిఫర్ 2 చూడాల్సిందే.