NTV Telugu Site icon

Gannavaram Airport: ఎయిరిండియా నిర్వాకం.. గన్నవరంలో ఇరుక్కుపోయిన కువైట్‌ ప్రయాణికులు..!

Gannavaram Airport

Gannavaram Airport

Gannavaram Airport: మరోసారి ఎయిరిండియా నిర్వాకం విదేశీ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసింది.. నేటి నుండి గన్నవరం-కువైట్ విమాన సర్వీసు ప్రారంభం అయిన విషయం విదితమే.. విజయవాడ నుండి నేరుగా కువైట్ కు విమాన సర్వీసు అందుబాటులోకి వచ్చేసింది.. ప్రతి బుధవారం గన్నవరం నుండి కువైట్‌కు విమానం బయల్దేరనుంది ఈ విమానం.. షెడ్యూల్‌ ప్రకారం ప్రతి బుధవారం ఉదయం 9.55 గంటలకు విజయవాడలో బయలుదేరి మధ్యాహ్నం 2.40 గంటలకు కువైట్‌ చేరుకుంటుంది.. ఇక, కువైట్‌లో సాయంత్రం 3.40 గంటలకు బయలుదేరి రాత్రి 8.35 గంటలకు తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ చేరుకోనుంది ఎయిరిండియా విమానం. ఇంత వరకు బాగానే ఉన్న ఎయిరిండియా చేసిన పొరపాటు ఇప్పుడు ప్రయాణికులను ఇబ్బంది పెడుతుంది.

Read Also: Traffic changed: రేపు ఉదయం 11 నుంచి రాత్రి 10 వరకు ట్రాఫిక్ ఆంక్షలు.. కారణం ఇదే

విజయవాడ నుంచి కువైట్‌కు విమానసర్వీసులు ప్రారంభమైన తొలిరోజు ఎయిరిండియా నిర్లక్ష్యంతో 11 మందికి పైగా ప్రయాణికులు వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది.. విమానం ఉదయం 9.55కు బయల్దేరాల్సి ఉండగా.. వారికి ఇష్యూ చేసిన టికెట్లలో మాత్రం మధ్యాహ్నం 1.10 గంటలకు అని పేర్కొంది ఎయిరిండియా.. టికెట్లపై మధ్యాహ్నం 1.10 గంటలకు విమానం అంటూ ముద్రించారు.. గన్నవరం నుండి కువైట్‌కు 85 మంది ప్రయాణికులు టికెట్‌ బుక్ చేసుకోగా.. విమానం బయల్దేరే సమయానికి 67 మంది ప్రయాణికులు మాత్రమే గన్నవరం చేరుకుని కువైట్ వెళ్లిపోయారు.. టికెట్‌పై మధ్యాహ్నం 1.10 అని ఉండడంతో ఆలస్యంగా 11 మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు.. మరికొంత మంది ప్రయాణికులు కూడా గన్నవరం చేరుకుంటున్నారు.. విమానం వెళ్లిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. అయితే, ప్రయాణికులు ఎయిరిండియా తప్పదంపై ప్రశ్నించగా డబ్బులు రీఫండ్‌ చేస్తామని సిబ్బంది చెప్పడంతో.. ఎయిరిండియా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు ప్రయాణికులు..

Show comments