Site icon NTV Telugu

Kuwait Fire: అగ్నిప్రమాదం కేసులో ముగ్గురు అరెస్ట్

Fire

Fire

కువైట్ అగ్నిప్రమాదంలో 50 మంది విదేశీ కార్మికులను బలి తీసుకున్న కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులతు అరెస్ట్ చేశారు. గత బుధవారం జరిగిన ప్రమాదంలో 50 మంది భారతీయులు, ఫిలిప్పీన్స్ ప్రాణాలు కోల్పోయారు. సెక్యూరిటీ గదిలో విద్యుత్ లోపం కారణంగా ఈ మంటలు చెలరేగాయి. పైగా తెల్లవారుజాము కావడం.. కార్మికులంతా నిద్రలో ఉండడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా జరిగింది. మంటలు వేగంగా వ్యాపించడం.. కార్మికులంతా లోపలే ఉండిపోవడంతో పొగ పీల్చి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.

ఇది కూడా చదవండి: Tiger: 36 గ్రామాల ప్రజలను భయపెట్టిన పులి.. 11 రోజులు శ్రమించి పట్టేశారు

ఒకే కంపెనీకి చెందిన 200 మంది కార్మికుల బస కోసం కంపెనీ ఒక అద్దె భవనాన్ని తీసుకుంది. ఆరు అంతస్తుల భవనంలో బుధవారం తెల్లవారుజమున మంటలు చెలరేగడంతో తప్పించుకునే మార్గం లేక మెట్లపైనే సజీవదహనం అయ్యారు. అయితే బిల్డింగ్ నిర్మాణంలో భద్రతా విధానాలు పాటించకపోవడం.. అగ్నిమాపక నిబంధనలు నిర్లక్ష్యం చేయడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే బిల్డింగ్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ ముగిసే వరకు కస్టడీలో ఉంటాడని కువైట్ ఉప ప్రధాని, రక్షణ మంత్రి తెలిపారు.

ఇది కూడా చదవండి: Ayodhya: “అయోధ్య రామాలయాన్ని కూల్చేస్తాం”..జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ బెదిరింపు

ఇదిలా ఉంటే ఈ అగ్నిప్రమాదంలో భారతీయులే ఎక్కువగా చనిపోవడం బాధాకర విషయం. దాదాపు 45 మంది దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ఇక ప్రధాని మోడీ సమీక్ష నిర్వహించి.. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

Exit mobile version