Site icon NTV Telugu

Munugode MLA : రేపే ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం

Mla Munugode

Mla Munugode

తెలంగాణలో ఉత్కంఠ కలిగించిన మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రేపు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఛాంబర్ లో ఉదయం 11 గంటలకు ప్రమాణం చేయనున్నారు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. మునుగోడులో మొత్తం 2,25,192 ఓట్లు పోలైతే.. టీఆర్ఎస్‌కు 42.95 శాతం ఓట్లు, బీజేపీకి 38.38 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 10.58 శాతం ఓట్లు.. ఇతరులకు 08.09 శాతం ఓట్లు దక్కాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ ఎన్నికలపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టిన సంగతి తెలిసిందే. మంత్రులు కేటీఆర్‌, జగదీష్‌రెడ్డి, హరీష్‌రావు.. ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఇలా అందరినీ బరిలోకి దింపారు.. ఇదే ఆ పార్టీకి కలిసివచ్చింది.. మునుగోడు గెలుపుతో.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గులాబీ పార్టీ వరుసగా మూడు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టింది.

మునుగోడు ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన కూసుకుంట్ల సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. తనకు అవకాశమిచ్చి తన విజయానికి కారణమైనందుకు మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ., సిఎం కెసిఆర్ కి కృతజ్జతలు తెలిపారు. మునుగోడు అభ్యర్థి విజయం కోసం కృషి చేసినందుకు పార్టీ నేతలను సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా అభినందించారు. ఇచ్చిన హామీలు నిలబెట్టేందుకు అధికారులతో సమన్వయం చేసుకుంటూ అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మంత్రి జగదీశ్ రెడ్డిని సిఎం కెసిఆర్ ఆదేశించారు.

Read Also: Vishwak Sen: అర్జున్ ‘ధమ్కీ’ విశ్వక్ కి మైనస్సా.. ప్లస్సా!?

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 2014-2018 మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (TRS) తరపున మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో 22,552 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు అదే రాజగోపాల్ రెడ్డిపై 10 వేల 309 ఓట్ల తేడాతో గెలిచారు. మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2022 ఆగస్టు 2న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో 2022 నవంబరు 3న జరిగే ఉప ఎన్నిక జరిగింది. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నికలో విజయం సాధించారు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాగా… మునుగోడులో మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

Read Also: Lovers Crime News: మూడేళ్ల క్రితమే యువతికి పెళ్లి.. ప్రియుడి కోసం ఆ పని

Exit mobile version