రౌడీ హీరో విజయ్ దేవరకొండ,సౌత్ స్టార్ హీరోయిన్ సమంత కలిసి నటిస్తున్న లేటెస్ట్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ ఖుషి ‘.. ఈ సినిమా స్టార్ట్ అవ్వగానే సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి.ఎందుకంటే విజయ్ మరియు సమంత పెయిర్ కు ఫ్యాన్స్ ఎంతగానో ఫిదా అయ్యారు.వీరి మధ్య కెమిస్ట్రీ చక్కగా వర్కౌట్ అయింది. ఈ సినిమా నుండి విడుదల అయిన మొదటి పాట చాట్ బస్టర్ గా నిలిచింది.తాజాగా ఈ సినిమా నుండి లేటెస్ట్ గా ఆరాధ్య సాంగ్ విడుదల అయింది.ఈ సాంగ్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.’ఆరాధ్య’ అంటూ సాగే ఈ సాంగ్ ను నిన్న సాయంత్రం విడుదల చేశారు…హేషమ్ అబ్దుల్ అందించిన సంగీతం మ్యూజిక్ లవర్స్ ను విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ సాంగ్ కూడా మరో చార్ట్ బస్టర్ గా నిలిచింది.. ఆరాధ్య సాంగ్ విడుదల అయ్యి 24 గంటలు కూడా కాకుండానే ఏకంగా 5 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసింది.. అలాగే టాప్ 1 లో నిలిచి ట్రెండింగ్ గా మారింది.
ఈ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఆయన డైరెక్టర్ గానే కాకుండా లిరిక్ రైటర్ గా కూడా ఆకట్టుకుంటున్నాడు.ఈ మూవీలో చాట్ బస్టర్ గా నిలిచిన రెండు పాటలను రాసింది ఆయనే.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మిస్తుండగా సెప్టెంబర్ 1న విడుదల కాబోతుంది…విజయ్ మరియు సమంత ఇద్దర వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నారు. విజయ్ లైగర్ సినిమాతో అలాగే సమంత శాకుంతలం సినిమాతో భారీ ప్లాప్ లను అందుకున్న సంగతి తెలిసిందే. అందుకే ఖుషి సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ విజయం సాధించాలని చూస్తున్నారు.ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరీ ఈ సినిమా వారు అనుకున్న స్థాయిలో రీచ్ అవుతుందో లేదో చూడాలి.