NTV Telugu Site icon

Kurnool: అవసరమైతే జిల్లా అంతటా 144 సెక్షన్ అమలు: కలెక్టర్ సృజన

Kurnool

Kurnool

Kurnool: ఎన్నికల కౌంటింగ్‌కు సిద్ధంగా ఉన్నామని కర్నూలు జిల్లా కలెక్టర్‌ సృజన పేర్కొన్నారు. కౌంటింగ్ సందర్భంగా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటు చేశామని.. 17 నుంచి 26 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి అవుతుందన్నారు. 144 సెక్షన్‌తో పాటు పోలీస్ యాక్ట్‌ 30 అమలులో ఉంటుందన్నారు. అవసరమైతే జిల్లా అంతటా 144 సెక్షన్ అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Read Also: Miss Vizag : భార్య ఉండగానే మరో పెళ్లి చేసుకున్న నటుడు.. అడ్డంగా బుక్ చేసేసిందిగా!

జూన్ 3 నుంచి ఇతర జిల్లాల వారు ఖాళీ చేయాలని.. కౌంటింగ్ కేంద్రాల నుంచి 2 కి.మీ దూరంలోని దుకాణాలను బంద్ చేయిస్తామన్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 3,4 తేదీల్లో మద్యం దుకాణాలు బంద్ అంటూ కలెక్టర్ ప్రకటించారు. నగర శివారులో 8 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. అన్ని పార్టీల ఆఫీసుల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. విజయోత్సవాలు, ర్యాలీలపై నిషేధం అమలులో ఉందని జిల్లా కలెక్టర్ సృజన వెల్లడించారు.