Kurnool Bus Accident: కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాద ఘటన తీవ్ర విషాదం మిగిల్చింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి 19 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు ఇంధన ట్యాంకర్‌ను బైక్ ఢీకొట్టడంతో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో బస్సు పూర్తిగా దగ్ధమయ్యింది.
READ MORE: Chittoor Mayor Couple Murder Case: చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో కీలక తీర్పు..
అయితే.. ఈ ఘటనకు సంబంధించి కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. బస్సు లగేజీ క్యాబిన్‌లో కూడా రెండు మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు. ఇంతకు ఆ మృతదేహాలు ఎవరివి..? అనే విషయం తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి పెద్ద వాదనలు బయటకు వస్తున్నాయి. ఇంతకీ క్యాబిన్‌లో మృతదేహాలు ఎక్కడి నుంచి వచ్చాయి. అక్రమంగా ఓనర్‌కి తెలియకుండా దొడ్డిదారిన డబ్బులు తీసుకుని ఈ ఇద్దరు ప్రయాణికులకు క్యాబిన్‌లో చోటు కల్పించారా? అనే ప్రశ్న లేవనెత్తుతున్నారు. మరోవైపు.. ఈ ప్రమాదంపై అటు యాజమాన్యం, ఇటు డ్రైవర్, క్లీనర్‌లు స్పందించడం లేదు. తమకేమి తెలియదంటూ ముఖం చాటేస్తున్నారు.
