Site icon NTV Telugu

AV Ranganath : చెరువు స్థలంలో రోడ్డు వేస్తే తొలగించాలి.. హైడ్రా కమిషనర్‌ ఆదేశం

Hydra Commissioner Av Ranganath

Hydra Commissioner Av Ranganath

AV Ranganath : రంగారెడ్డి జిల్లా కుంట్లూర్ పెద్ద చెరువు కబ్జాపై హైడ్రా సర్వే చేస్తున్న స్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ పరిశీలించారు. కుంట్లూర్ పెద్ద చెరువు కబ్జా చేసి రోడ్డు వేస్తున్నారని ఆరోపణతో నిన్నటి నుండి హైడ్రా అధికారులు సర్వే చేస్తున్నారు. మున్సిపల్ నిధులతో రోడ్డు నిర్మాణానికి తీర్మానం చేయడంపై పెద్దఅంబర్ పేట్ మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డిపై ఏవీ రంగనాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో కమిషనర్‌పై యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. చెరువు భూమిలో ఎలా రోడ్డుకు నిధులు కేటాయిస్తారని రంగనాధ్ ప్రశ్నించారు. సర్వే త్వరగా పూర్తి చేసి చెరువు, పట్టా భూమి బార్డర్ లో రోడ్డు ఫిక్స్ చేయాలని హైడ్రా సిబ్బందికి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ సూచించారు. చెరువు స్థలంలో రోడ్డు వేస్తే తొలగించాలని హైడ్రా సిబ్బందికి ఆదేశించారు ఏవీ రంగనాథ్‌.

Maharashtra Cabinet: ‘మహా’ కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఖరారు..! సాయంత్రం మోడీతో ఫడ్నవిస్ భేటీ

Exit mobile version