Site icon NTV Telugu

Pawan Kalyan: కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ సక్సెస్.. సరిహద్దు ప్రాంత రైతులకి భరోసా

Kumki Elephant

Kumki Elephant

కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆపరేషన్ కుంకీతో సరిహద్దు ప్రాంత రైతులకి భరోసా అని అన్నారు. పంటల్ని ధ్వంసం చేస్తున్న ఏనుగుల్ని.. కుంకీలు దారి మళ్లించాయి.. తొలి ఆపరేషన్ విజయవంతం చేసిన అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండల పరిధిలోని మొగిలి వద్ద మామిడి తోటలను ధ్వంసం చేస్తున్న అటవీ ఏనుగుల గుంపుని కుంకీలు విజయవంతంగా దారి మళ్లించి అడవిలోకి తరిమికొట్టినట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు.

Also Read:Peddi: పెద్ది కోసం రంగంలోకి జిగేల్ రాణి?

కృష్ణ, జయంత్, వినాయక అనే కుంకీలు ఆ ఆపరేషన్ లో పాల్గొని అడవి ఏనుగులను పంటల వైపు రాకుండా అడ్డుకుని తిరిగి అడవిలోకి మళ్లించాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కొనసాగిన ఈ ఆపరేషన్ లో కర్ణాటక నుంచి తీసుకువచ్చిన కృష్ణ అనే కుంకీ ఏనుగు చాలా చురుకుగా పాల్గొన్నట్టు అటవీ అధికారులు తెలియజేశారు. మొగిలి ప్రాంతంలో 15 రోజులుగా ఏనుగుల సంచారం ఉన్న సమాచారంతో అధికారులు ఈ ఆపరేషన్ చేపట్టారు.

Also Read:Shubman Gill: అతడు ఓ అద్భుతం.. విజ‌యానికి మేము అన్ని విధాలా ఆర్హులం!

కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను తీసుకువచ్చిన అనంతరం రెండు నెలల శిక్షణ తర్వాత మొదటి ఆపరేషన్ విజయవంతంగా చేపట్టడం ఆనందాన్నిచ్చింది. ఏనుగుల సంచారంతో ఇబ్బందులు పడుతున్న సరిహద్దు ప్రాంతాల రైతులు, ప్రజలకు ఈ ఆపరేషన్ భరోసా ఇస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏనుగుల గుంపు నుంచి పంటలను, ప్రజల ప్రాణాలు కాపాడే దిశగా ప్రణాళికాబద్ధంగా పని చేస్తుంది అనడానికి కుంకీలతో చేపట్టిన ఆపరేషన్ తొలి అడుగు.

Also Read:MLC Kavitha : రిజర్వేషన్లపై తగ్గేదెలే.. ఎన్నికలు ఎలా ఆపాలో మాకు తెలుసు

ఈ ఆపరేషన్ లో పాల్గొన్న అటవీ అధికారులకు, మావటిలు, కావడిలకు అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే అడిగిన వెంటనే కుంకీ ఏనుగులు రాష్ట్రానికి ఇచ్చి సహకరించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి, ఆ రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేకి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తదుపరి ఆపరేషన్ పుంగనూరు అటవీ ప్రాంతంలో చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు.

Exit mobile version