Site icon NTV Telugu

Kunamneni Sambasivarao: సీపీఐ, సీపీఎం కలిసిపోవాలని నిర్ణయం చేశాం: సాంబశివరావు

Kunamneni Sambasivarao

Kunamneni Sambasivarao

CPI and CPM parties Meeting Today: సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో రెండు కమ్యునిస్ట్ పార్టీల (సీపీఐ, సీపీఎం) ముఖ్య నేతల సమావేశం నేడు జరిగింది. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు శంకర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుకు పల్లి సీతారాములు, జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికలో అనుసరించే ప్రణాళికలపై ఈ సమావేశం సాగినట్టు తెలుస్తోంది.

సమావేశం అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ… ‘ఎంఐఎం, బీఆర్‌ఎస్‌లు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. ఏదో రకంగా ఈ రెండు పార్టీలు బీజేపీకి సహకరిస్తున్నాయి. అందరి మీద దాడి చేస్తున్న బీజేపీ.. ఎంఐఎం, బీఆర్‌ఎస్‌లను మాత్రం టచ్ చేయడం లేదు. రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం తీసేయడం దారుణం. మాది హిందూ అజెండా అని చెప్పాలని బీజేపీ నిర్ణయించింది’ అని అన్నారు.

Also Read: Viral Video: హ్యాట్సాఫ్ బాసూ.. ఒంటికాలితో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన యువకుడు!

‘సీపీఐ, సీపీఎం కలిసిపోవాలని నిర్ణయం చేశాం. రెండు పార్టీలు కలిసి సంప్రదింపులు చేయాలని అనుకుంటున్నాం. రానున్న ఎన్నికలపై చర్చ చేశాం. వినాయక నిమజ్జనం తర్వాత మరోసారి సీపీఐ, సీపీఎం నేతలం సమావేశం అవుతాం. అక్టోబర్ 1 నుంచి కలిసి పని చేస్తాం. మా భేటీలో కాంగ్రెస్ చర్చ రాలేదు. అందరం కలిసి కూర్చున్నప్పుడు దానిపై చర్చిస్తాం. కాంగ్రెస్‌తో పొత్తు వద్దు అని మేం అనుకోలేదు. అందరం కలిసి చర్చించుకున్నాక ఓ నిర్ణయానికి వస్తాం’ అని కూనంనేని సాంబశివరావు తెలిపారు.

Exit mobile version