Kunamneni Sambasiva Rao : తెలంగాణపై నరేంద్ర మోడీ కుట్రలు మానాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే విధంగా, ప్రగతిని ముందుకు సాగనీయకుండా కేంద్రంలో మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. రాష్ట్రంలోని పరిపాలనను అస్థిరపరచడంతో పాటు , ప్రభుత్వాన్ని కూలద్రోసే విధంగా స్వతంత్ర, రాజ్యాంగ సంస్థలైన ఐటి, ఎన్నికల కమిషన్, గవర్నర్ వ్యవస్థలను తీవ్రంగా దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు కూనంనేని. మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు దేశం అప్పు రూ.55 లక్షల కోట్లు ఉంటే, ఇప్పుడు రూ.155 లక్షల కోట్లకు చేరిందని, ఎనిమిదేళ్ళలో రూ.100 లక్షల కోట్ల అప్పులు అదనంగా చేసిన ఘనులు అని కూనంనేని మండిపడ్డారు.
Also Read : CM Ys Jagan Great Heart: బాలుడి పరిస్థితి చూసి చలించిపోయిన సీఎం జగన్.. వెంటనే సాయం..
తెలంగాణకు ఆంక్షలు పెడుతూ ఆర్థిక దిగ్భంధనం చేస్తున్నారని ఎద్దేవా చేశారని కూనంనేని వ్యాఖ్యానించారు. తమ చేతుల్లోని వ్యవస్థలతోరాష్ట్రంపై ఆర్థిక, రాజకీయ, అనైతిక పద్ధతుల్లో కేంద్రం ముప్పేట దాడి చేస్తోందన్నారు కూనంనేని. తద్వారా తెలంగాణలో అస్థిర పరిస్థితుల ఉన్నాయని బయట ప్రపంచానికి తప్పుడు సంకేతాలు పంపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అసలు విభజన హామీలే అమలు చేయని బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తామంటూ పగటి కలలు కంటోందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే కేంద్ర ప్రభుత్వం అదనపు నిధులు ఇచ్చి, అభివృద్ధి చేసి ప్రజల మనసులు చూరగొనాలే తప్ప కుయుక్తులతో సాధ్యం కాదని స్పష్టం చేశారు.
Also Read : Nara Brahmani : వావ్.. నారా బ్రహ్మణిలో మరో టాలెంట్.. లడక్‌లో బైక్ రైడింగ్ వీడియో..
Also Read
- Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
- Sonam Wangchuk: "అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా".. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
- 170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
ఒకవైపు రాష్ట్రం స్వంత వనరులతో ముందుకు సాగుతోంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా తెలంగాణకు వివిధ రూపాలలో రావాల్సిన రూ.50 వేల కోట్ల వరకు నిధులకు మోకాలడ్డుతూ ఆర్థిక దాడి పాల్పొడుతోందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్, పదహారవ ప్రణాళిక సంఘం చేసిన సిఫార్సులను తుంగలో తొకి ఒక్క రూపాయి కూడా తెలంగాణకు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికలో గెలుపొందడం ద్వారా రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేస్తామనుకున్న అంచనాలను ఓటర్లు పటాపంచలు కావడంతో బీజేపీ జీర్ణించుకోలేకపోతున్నదని పేర్కొన్నారు. అందుకే రాష్ట్రంలో తన చేతిలోని ఈడీ, ఐటీలను దుర్వినియోగం చేయడం, గవర్నర్ ద్వారా ఇబ్బందులు సృష్టించడం ద్వారా రాజకీయ దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు.
మరో వైపు ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు మఠాధిపతులతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే అనైతిక పద్ధతులకు పాల్పడుతోందన్నారు. పాద యాత్రల పేరుతో బండి సంజయ్ మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇవన్నీ కూడా ప్రపంచానికి తెలంగాణను తప్పుడు కోణంలో చూపే ప్రయత్నాలేనని కూనంనేని అన్నారు. తక్షణమే తెలంగాణకు రావాల్సిన జిఎస్ బకాయిల నుండి ఇతర నిధుల వరకు తెలంగాణకు రావాల్సిన నిధులను విడుదల చేయకపోతే, తెలంగాణ ప్రజల పట్ల కక్షపూరిత వైఖరిని కొనసాగిస్తూ ఉంటే తెలంగాణ ప్రజలు అంగీకరించే సమస్యే లేదన్నారు. కమ్యూనిస్టు పార్టీ కూడా కేంద్ర దుర్నీతికి వ్యతిరేకంగా కుట్రలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలకు సంసిద్ధమవుతుందని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
-
Sonam Wangchuk: “అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా”.. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!