దేశంలో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మణిపూర్ సంఘటనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడంతో సుప్రీంకోర్టు కలగజేసుకుందన్నారు. బీజేపీ మతం పేరుతో విభజన రాజకీయాలకు మహిళలను బలి పశువుని చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కార్మికుల హక్కులను కాలరాసే, అణిచివేసే, పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఈ విధానం సరైంది కాదని హితవు పలికారు కూనంనేని.
Also Read : Redmi 12 series: రిలీజైన రోజే రికార్డు స్థాయి అమ్మకాలు.. ఎన్నో తెలుసా..!
వరద బాధితులకు తక్షణం సహాయ అందించాలని ఆయన డిమాండ్ చేశారు. వరద బాధితులకు కేంద్రం ఐదు కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ఐదు కోట్లు, విడుదల చేసి శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన అన్నారు. సీపీఐ, సీపీఎం, కలిసి అసెంబ్లీలో ప్రవేశించాలని కృత నిశ్చయంతో ముందుకు వెళ్తున్నామని ఆయన వెల్లడించారు. సీపీఐ, సీపీఎం ఇద్దరం కలిసి కార్యచరణ రూపొందించుకుటున్నామని ఆయన వ్యాఖ్యానించారు. కలిసి వచ్చేవారుతో వెళతామని ఆయన ఉద్ఘాటించారు. లేదనుకుంటే.. అవసరమైతే సొంతంగా పోటీకి సిద్ధంగా ఉంటామని ఆయన తెలిపారు.
Also Read : Train Accident: ఘోర రైలు ప్రమాదం.. 15 మంది మృతి, 40 మందికి పైగా గాయాలు
అధికార యంత్రాంగానికి ముందుచూపు లేకపోవడంతోనే ఏటా వర్షాకాలంలో ఏజెన్సీ ప్రజలు ముంపు బారిన పడి నష్టపోతున్నారని కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఇటీవల వర్షాలతో దెబ్బతిన్న చుంచుపల్లి మండలం పెనుబల్లి బ్రిడ్జిని పరిశీలించిన అనంతరం ఆయన పాత కొత్తగూడెంలోని ఎస్సీ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. ఏటా ప్రజలు ముంపు బారిన పడుతున్నా శాశ్వత చర్యలు చేపట్టడంపై ఎవరూ దృష్టి సారించడం లేదన్నారు. పాల్వంచ చెక్‌డ్యామ్ నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడంతో వరదలకు ధ్వంసమై రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు.
