Kulgam Encounter: కాశ్మీర్లో చివరి లష్కర్ ఉగ్రవాది హతం.. భద్రతా దళాలపై అమిత్ షా ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kulgam Encounter: జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాంలో లష్కర్-ఎ-తొయిబా ఉగ్రవాది లతీఫ్ భట్‌ను భద్రతా దళాలు హతమార్చాయి. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్(CRPF), నిఘా సంస్థల సిబ్బందిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభినందించారు. కాశ్మీర్ లోయలో క్రియాశీలకంగా ఉన్న చివరి స్థానిక ఉగ్రవాది లతీఫ్ భట్ అని ఆయన పేర్కొన్నారు. బుధవారం తెల్లవారుజామున కుల్గాంలో భద్రతా దళాలు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లతీఫ్ భట్‌ను హతమార్చాయి.
అన్ని భద్రతా సంస్థల మధ్య అద్భుతమైన సమన్వయం కనిపించిందని అమిత్ షా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న సిబ్బంది ధైర్యసాహసాలను దేశం అభినందిస్తోందని ఆయన అన్నారు. లతీఫ్ భట్ సహచరుడిగా భావిస్తున్న మరో ఉగ్రవాది ఉమర్ నిసార్ కూడా అంతకుముందు రోజు కుల్గాంలో జరిగిన మరో ఎన్కౌంటర్లో హతమైనట్లు అమిత్ షా తన పోస్టులో వెల్లడించారు.
Also Read
- Madurai Tanishq Robbery Case: తనిష్క్ దోపిడీ కేసులో కొత్త ట్విస్ట్.. TVK–NTK మధ్య పొలిటికల్ వార్..!
- India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
- BJP Slams Rahul Gandhi: 'భారత్ ఆర్థిక విపత్తు అంచున ఉంది'.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర విమర్శలు!
- Kulgam Encounter: అల్లాహ్‌ను కలవాలని ఉంది.. నేను చాలా సంతోషంగా ఉన్నా.. ఎన్‌కౌంటర్‌కు ముందు లతీఫ్ భట్ చివరి మాటలు!
మసీదులో దాక్కున్న లతీఫ్ భట్..
కుల్గాం జిల్లాలోని జంగల్పోరా ప్రాంతంలో భద్రతా బలగాలు లతీఫ్ సమాచారం తెలిసి చుట్టుముట్టాయి. లతీఫ్ లొంగిపోయేలా భద్రతా బలగాలు వీడియో కాల్ చేసి ఒప్పించే ప్రయత్నం చేశాయి. ‘‘అల్లా తప్ప నాతో ఎవరూ లేరు’’ అని లతీఫ్ చెబుతూ లొంగిపోవడానికి నిరాకరించాడు. తెల్లవారుజామున 2.45 గంటల సమయంలో లతీఫ్ మసీదు కాల్పులు జరపడంతో, భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపి ఉగ్రవాదిని హతమర్చాచి.
మసీదుకు నష్టం కలగకుండా ఆపరేషన్..
మసీదుకు ఎలాంటి నష్టం కలుగకుండా భద్రతా బలగాలు జాగ్రత్తగా ఆపరేషన్ చేపట్టాయి. లతీఫ్ బయటకు వచ్చేలా టియర్ గ్యాస్ ఉపయోగించి, అతను బయటకు వచ్చిన తర్వాత కాల్చి చంపారు. ఆపరేషన్ సమయంలో మసీదుకు సాధ్యమైనంత తక్కువ నష్టం కలిగించడానికే ప్రాధాన్యత ఇచ్చామని ఎస్ఎస్పీ అనాయత్ అలీ తెలిపారు.
లష్కరే తోయిబాలో చేరిన ఏడాదికే హతం..
2025 నవంబర్‌లో లతీఫ్ భట్ లష్కరే తోయిబాలో చేరాడు. ఉగ్రవాదానికి ఆకర్షితుడైన లతీఫ్‌కు పాకిస్తాన్ నుంచి ఆదేశాలు అందేవని అధికారులు చెబుతున్నారు. శాంతిభద్రతలు, పర్యాటక రంగానికి, స్థానిక ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగించేలా కార్యకలాపాలకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇటీవల సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడికి లతీఫ్ ప్రధాన సూత్రధారిగా చెబుతున్నారు. లష్కరే తోయిబాలో చేరిన ఏడాదికే భద్రతా బలగాల చేతిలో హతమయ్యాడు.
With the coordinated efforts of JKP, Indian Army, CRPF and intelligence agencies, Lashkar’s last known active local terrorist in the valley, Lateef Bhat, was neutralised in an operation in Kulgam in the early morning hours today. One of his terrorist associates, Umar Nisar, was also neutralised in Kulgam, the day before. The entire operation was marked by a very high level of synergy.
The nation salutes the brave Jawans of JKP, Army and CRPF and intelligence agencies.
— Amit Shah (@AmitShah) November 18, 2026
తాజావార్తలు
-
Kulgam Encounter: కాశ్మీర్లో చివరి లష్కర్ ఉగ్రవాది హతం.. భద్రతా దళాలపై అమిత్ షా ప్రశంసలు..
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
Cyber Fraud: టాలీవుడ్ నటికి సైబర్ షాక్.. రూ.4.14 లక్షలు స్వాహా!
-
Cyber Fraud: అమరావతి రాజధాని రైతులే టార్గెట్.. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు కాజేస్తున్న కేటుగాళ్లు!
-
Instagram New Rules in India: కేంద్రం సీరియస్.. Instagram అల్గారిథమ్ మార్చిన Meta.. యూజర్లకు కొత్త రూల్స్!
ట్రెండింగ్
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..
-
SRH-IPL 2027: హెడ్‌కు గుడ్‌బై.. మరో 8 మంది అవుట్.. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!