Kuldeep Wedding: జడేజా కాళ్లు మొక్కిన కుల్దిప్.. వీడియో వైరల్ !
- లక్నోలో కుల్దీప్ యాదవ్ గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్
- జడేజా దంపతుల కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న నూతన జంట...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kuldeep Wedding: భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వివాహ వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి. తన చిన్ననాటి స్నేహితురాలు వంశిక చద్దాను మార్చి 14న ముస్సోరీలో పెళ్లాడిన కుల్దీప్, మంగళవారం రాత్రి లక్నోలోని ‘ది సెంట్రమ్’ హోటల్లో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ వేడుకలో ఒక అద్భుతమైన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. టీమిండియా సీనియర్ ప్లేయర్ రవీంద్ర జడేజా తన భార్య రివాబాతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ క్రమంలో కుల్దీప్, వంశిక జంట జడేజా దంపతుల కాళ్లకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. సీనియర్ల పట్ల కుల్దీప్ చూపిన ఈ గౌరవం, రివాబా ఎంతో ఆప్యాయంగా ఆ దంపతులను దీవించిన తీరు నెట్టింట వైరల్ అవుతోంది.
READ ALSO: Pakistan Crisis: పాకిస్థాన్‌పై ముప్పేట దాడి.. నూనె లేదు, పిండి లేదు.. తీవ్ర సంక్షోభంలో దాయాది దేశం..
Also Read
- Kapil Dev: "బాధ ఎందుకు.. పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలి".. రోహిత్ రిటైర్మెంట్పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
- Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
- NEET Ranker: కన్నీటి నుంచి పుట్టిన సంకల్పం.. తండ్రి మరణాన్ని స్ఫూర్తిగా మార్చుకుని 'నీట్'లో ర్యాంక్..
- NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
తరలివచ్చిన ప్రముఖులు
ఈ గ్రాండ్ రిసెప్షన్‌కు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరితో పాటు క్రికెటర్లు రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, శిఖర్ ధావన్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, యూపీ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా తదితరులు పాల్గొన్నారు.
వింటేజ్ కార్లో స్టైలిష్ ఎంట్రీ
ఈ రిసెప్షన్ వేడుకలో కుల్దీప్ యాదవ్ నలుపు రంగు సూట్లో మెరిసిపోగా, వంశిక క్రీమ్ కలర్ చీరలో ఎంతో హుందాగా కనిపించారు. ఈ జంట వేదిక వద్దకు వింటేజ్ ‘రోల్స్ రాయిస్’ కార్లో రాజసం ఉట్టిపడేలా ఎంట్రీ ఇవ్వడం విశేషం. 31 ఏళ్ల ఈ స్పిన్నర్ తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించినందుకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Kuldeep Yadav touched the feet of Rivaba and Ravindra Jadeja.
The way Rivaba blessed Kuldeep was heartwarming 🤌❤️ pic.twitter.com/FGwsl6nH1r
— Tejash (@Tejashyyyyy) March 18, 2026
READ ALSO: IPL 2026: కోహ్లీ వర్సెస్ రికార్డ్స్.. ఐపీఎల్లో నయా చరిత్రకు అడుగు దూరంలో కింగ్!
తాజావార్తలు
-
Kapil Dev: “బాధ ఎందుకు.. పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలి”.. రోహిత్ రిటైర్మెంట్పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
-
Anaconda vs Python: అనకొండా, కొండచిలువ ఒకటే అనుకుంటున్నారా? అసలు తేడా ఇదే!
-
Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
-
KTR : స్థానిక యువతకు 95 శాతం ఉద్యోగాలు సాధించింది కేసీఆరే
-
Maheshwara Reddy: రివ్యూలపై ‘ఓ సుకుమారి’ నిర్మాత షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!