Kuldeep Yadav: కష్టాన్నే నమ్ముకున్న కుల్దీప్.. ఒక్కమాట అనలేదు! చివరకు బెండు తీశాడు
- ఆరు నెలలుగా కుల్దీప్ యాదవ్ బెంచ్‌కే పరిమితం
- ఎట్టకేలకు ఆసియా కప్ 2025లో అవకాశం
- 3 బంతుల్లో 7 పరుగులే ఇచ్చి 4 వికెట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ గత ఆరు నెలలుగా బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ప్రతి టీమిండియా స్క్వాడ్‌లోనూ ఉంటున్నా.. తుది జట్టులో మాత్రం అవకాశం రావడం లేదు. 2025 ఆరంభంలో ఇంగ్లండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు ఎంపికయ్యాడు. ఐదు టీ20ల్లో ఒక్కసారి కూడా ఛాన్స్ రాలేదు కానీ.. రెండు వన్డేల్లో ఆడాడు. ఆ తర్వాత దుబాయ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆడిన కుల్దీప్.. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక అయ్యాడు. ఇంగ్లీష్ గడ్డపై అతడు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు.
ఆరు నెలలుగా బెంచ్‌కే పరిమితం అయినా కుల్దీప్ యాదవ్ నిరాశ పడలేదు, కుంగిపోలేదు. ఇదే పరిస్థితిలో మరో సీనియర్ ప్లేయర్ అయితే తన అసహనాన్ని ఎక్కడో ఓ చోట కచ్చితంగా వ్యక్తం చేసేవాడే. కానీ కుల్దీప్ అలా చేయకుండా.. కష్టాన్నే నమ్ముకున్నాడు. మరింత ఎక్కువ ప్రాక్టీస్ చేశాడు. ఎట్టకేలకు ఆసియా కప్ 2025 రూపంలో అతడికి అవకాశం వచ్చింది. దుబాయ్ పిచ్ స్పిన్‌కు అనుకూలం కావడంతో అతడికి ఛాన్స్ ఇవ్వక మేనేజ్మెంట్కు తప్పలేదు. వచ్చిన అవకాశాన్ని కుల్దీప్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. యూఏఈపై సత్తాచాటాడు. 13 బంతులే సంధించిన కుల్దీప్.. 7 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
Also Read
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
Also Read: Boycott Asia Cup: టీమిండియా ఆటగాళ్లపై గౌరవం పోయింది.. బాయ్‌కాట్ ఆసియా కప్!
యూఏఈపై ఒకే ఓవర్లో మూడు వికెట్స్ తీయడం అద్భుతమనే చెప్పాలి. ఈ ప్రదర్శనతో తనలో మాయాజాలం ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాడు. సాధారణంగా పవర్ ప్లే ముగిసిన తర్వాత బ్యాటర్లు ఎక్కువగా హిట్టింగ్ చేయడానికి ముందుకు రారు. కుల్దీప్ మాత్రం ఊరించేలా బంతులు వేస్తూ బుట్టలో వేస్తాడు. కుల్దీప్ ప్రధాన అస్త్రం ఫ్లైటెడ్ డెలివరీ. సహచర స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ జట్టులో చోటు కోల్పోగా.. కుల్దీప్ మాత్రం సత్తాచాటుతున్నాడు. పాకిస్థాన్ మ్యాచ్‌లోనూ కుల్దీప్ టీమిండియాకు ప్రధాన అస్త్రం కానున్నాడు.
First wicket:👏
Second wicket: 👏👏
Third wicket: 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏pic.twitter.com/4lbI752X0a— Delhi Capitals (@DelhiCapitals) September 10, 2025
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్‌లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?