Fire Accident: భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన గుడిసలు, కట్టెల దుకాణం.!

Fire Accident

Fire Accident

Fire Accident: హైదరాబాద్ కూకట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దోమల నివారణ కోసం పెట్టిన పొగతో హరిజన సేవా సంఘం కాలనీలో గుడిసలు తగలబడ్డాయి. పక్కనే ఉన్న కట్టెల దుకాణానికి మంటలు వ్యాపించడంతో షాప్ కాలి బూడిదయింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు అవ్వడంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలకి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.