NTV Telugu Site icon

KTR: ఫార్ములా ఈ- కార్ రేస్ కేసుపై కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్..

Ktr 3

Ktr 3

ఫార్ములా ఈ రేస్ ఇష్యూపై తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత రెండు మూడు రోజులుగా తనపై కేస్ అని లీక్‌లు ఇస్తున్నారు.. నాలుగు గోడల మధ్య ఎందుకు.. అసెంబ్లీలో చర్చ పెట్టండి అని అడిగానన్నారు. ఈ క్రమంలో.. రేవంత్ రెడ్డికి లేఖ కూడా రాశానని కేటీఆర్ తెలిపారు. అయినా చర్చకు వచ్చే దమ్ము లేదు ప్రభుత్వానికి అని పేర్కొన్నారు. అసలు ఏమి జరిగిందో ప్రజలకు చెప్పాలని మీడియా సమావేశం పెట్టానన్నారు. హైదరాబాద్‌లో రేసింగ్ రావాలని చాలా ప్రయత్నాలు గతంలో జరిగాయి.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఫార్ములా రేసింగ్ కోసం ఎంతో ప్రయత్నం చేశాడన్నారు. 2003 ప్రాంతంలో ఫార్ములా ఈ రేసింగ్ సీఈవోను కలిసి హైదరాబాద్ కు రావాలని అడిగారు.. చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోవడంతో హైదరాబాద్ రేసింగ్ రాలేదని తెలిపారు. అప్పట్లోనే గోపన్ పల్లిలో రేసింగ్ కోసం 500 ఎకరాలు సేకరించారని కేటీఆర్ పేర్కొన్నారు.

Read Also: Devendra fadnavis: అజిత్ పవార్ ఏదొక రోజు సీఎం అవుతారు.. ఫడ్నవిస్ జోస్యం

ప్రభుత్వం సేకరించిన 500 ఎకరాల్లో రేవంత్ రెడ్డికి కూడా15 ఎకరాలు ఉందని కేటీఆర్ తెలిపారు. అన్ని ప్రయత్నాలు చేసినా హైదరాబాద్‌కు రేసింగ్ రాలేదని చెప్పారు. మన దేశంలో కూడా ఈ రేసింగ్ రావడం కోసం ఎంతో అడిగారు.. ఉత్తరప్రదేశ్‌లో 2009, 10, 11లో రేసింగ్ జరిగిందన్నారు. అందుకోసం యూపీలో 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు.. ఈ రేసింగ్ కోసం దేశంలో ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది.. ఇక ఈ రేసింగ్ కోసం ఎలక్ట్రికల్ వాహనాలు వచ్చాయన్నారు. 2014లో తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాము కూడా ఈ ఎలక్ట్రికల్ వాహనాలు తీసుకు రావాలని ప్లాన్ చేశామని తెలిపారు. ఆటోమొబిల్ రంగంలో తెలంగాణను నెంబర్ వన్ గా చేయాలి అనుకున్నామని కేటీఆర్ తెలిపారు.

Read Also: Atul Subhash suicide: రాహుల్ కాన్వాయ్‌ను వెంబడించిన అతుల్ స్నేహితులు.. ప్రతిపక్ష నేత ఏం రిప్లై ఇచ్చారంటే..!

ఎలక్ట్రిక్ వాహనాలకు హైదరాబాద్ అడ్డా చేయాలి అనుకున్నాం.. ఫార్ములా ఈ వాళ్ళను కలిసి హైదరాబాద్ రావాలని బతిమిలాడామని కేటీఆర్ తెలిపారు. 2022 అక్టోబర్‌లో ఫార్ములా ఈ రేసింగ్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నాం.. 2023 ఫిబ్రవరిలో రేసింగ్ జరిగిందన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్, పలువురు క్రీడాకారులు, నటులు కూడా ఈ రేసింగ్ కోసం వచ్చారని పేర్కొన్నారు. 2023 ఫిబ్రవరిలో రేస్ జరిగింది.. దీనికి హెచ్ఎండీఏ ఖర్చు పెట్టింది.. హెచ్ఎండీఏ నుంచి రూ. 30, 35 కోట్లు ఖర్చు పెట్టామని కేటీఆర్ తెలిపారు.