NTV Telugu Site icon

KTR: రేపు ఈడీ విచారణకు కేటీఆర్..

Ktr

Ktr

రేపు ఈడీ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం10.30 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. నంది నగర్ నివాసం నుంచి 10 గంటలకు బయలుదేరనున్నారు కేటీఆర్. ఫార్ములా-ఈ కార్ కేసులో భాగంగా ఈడీ అధికారులు కేటీఆర్‌ను విచారించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఎచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. నిధుల బదలాయింపులో ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఎఫ్ఈవోకు రూ.45 కోట్లు యూకే ఫౌండ్స్ రూపంలో చెల్లించడంలో ఉల్లంఘనలు జరిగినట్లు తేల్చింది. నిధుల బదలాయింపులో నిబంధనలు పాటించకపోవడంపై ఈడీ కేటీఆర్ ను ప్రశ్నించనుంది.

Manchu Manoj: మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత.. ఒకరినొకరు కొట్టుకున్న బౌన్సర్లు!

ఇదిలా ఉంటే.. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ ఈ నెల 9న ఏసీబీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.. విచారణ అనంతరం కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ ఇచ్చిన 4-5 ప్రశ్నలను.. అలా తిప్పి, ఇలా తిప్పి అడిగారు.. విచారణకు పూర్తిగా సహకరించానని కేటీఆర్‌ చెప్పారు. ఏసీబీ వాళ్లకు కూడా ఈ కేసులో ఏమి లేదని తెలుసని.. ఇంకా తనపై వంద కేసులు పెట్టినా ఎదుర్కొంటామని కేటీఆర్ చెప్పారు. ఇదొక లొట్టపీసు కేసు మాత్రమేనని విమర్శించారు.