NTV Telugu Site icon

Chilkur Balaji Temple: అర్చకుడు రంగరాజన్ ను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

Ktr

Ktr

Chilkur Balaji Temple: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై జరిగిన దాడి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారక రామారావు (KTR) రంగరాజన్‌ను వ్యక్తిగతంగా పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ఇది అత్యంత దుర్మార్గమైన, నీచమైన చర్య. దీన్ని ఎవరు చేసినా, ఏ పేరుతో చేసినా ఉపేక్షించకూడదని అన్నారు. దేవాలయ సేవలో నిమగ్నమవుతున్న రంగరాజన్, సౌందర్య రాజ్యం కుటుంబ పరిస్థితి ఈ దాడి వల్ల ఎంతటి ఆవేదనలో ఉందో చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read: Masthan Sai : మస్తాన్ సాయి- లావణ్య కేసులో వెలుగులోకి మరో ఆడియో

దాడికి పాల్పడ్డవారు ఏ ముసుగులో ఉన్నా, ఏ యెజెండతో ఉన్నా, తప్పకుండా చట్టపరంగా కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కట్టుబడి ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. రంగరాజన్‌పై దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన రేపింది. దేవాలయాల్లో సేవలందిస్తున్న అర్చకులపై దాడి రాష్ట్ర సంస్కృతికి తీరని నష్టం కలిగిస్తుందని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని కోరుతూ భక్తులు పెద్ద సంఖ్యలో సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు.