NTV Telugu Site icon

Minister KTR: శిల్పా లేఔట్ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

Ktr

Ktr

Minister KTR: గ్రేటర్ హైదరాబాద్ సిటీలో రోజు రోజుకు ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది. అందుకు తగినట్లు రోడ్ల విస్తరణ చేపట్టాల్సిన అవసరం ఉంది. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఈ క్రమంలో పలు లింక్ రోడ్లు, వంతెనలను టీఆర్ఎస్ సర్కార్ నిర్మిస్తోంది. అంతర్జాతీయ నగరంగా భావిస్తోన్న హైదరాబాద్ మహానగరంలో మరో అద్భుత ప్లైఓవర్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించనున్నారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ (ఎస్ఆర్డీపీ) లో భాగంగా నిర్మించిన శిల్పా లేఔట్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని మున్సిపల్ మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించనున్నారు. పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు సిటీలో 16 ఫ్లైఓవర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. నేడు 17వ ఫ్లై ఓవర్ శిల్ప లే ఔట్ ఫ్లై ఓవర్ ను మొదలు పెట్టనున్నారు. ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే అవుటర్ రింగ్ రోడ్డు నుంచి గచ్చిబౌలి మీదుగా పఠాన్ చెరు, కోకాపేట్, నార్సింగ్ నుంచి ఎయిర్ పోర్ట్ కు వెళ్లేందుకు ప్రయాణం సులువు అవుతుందని అధికారులు చెప్తున్నారు.

Read Also: Fraud: కేటుగాడి సబ్‌ కలెక్టర్‌ అవతారం.. లక్షలు ముంచేశాడు..!

ఎస్‌ఆర్‌డీపీ పథకంలో జీహెచ్‌ఎంసీ 41 పనులు, మిగతా 6 పనులు ఆయా శాఖలైన హెచ్‌ఎండీఏ, ఆర్‌అండ్‌బీ, నేషనల్‌ హైవే ద్వారా మొత్తం 47 పనులు చేపట్టారు. మొత్తం 47 పనుల్లో 32పూర్తయ్యాయి. మరో 15 పనులు అభివృద్ధి దశలో ఉన్నాయి. పూర్తయిన 32 పనుల్లో 16 ఫ్లై ఓవర్లు, ఐదు అండర్‌ పాసులు, ఏడు ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలు, కేబుల్‌ బ్రిడ్జి, పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జి, పంజాగుట్ట వైడెనింగ్‌, ఓఆర్‌ఆర్‌ నుంచి మెదక్‌ రిహబిటేషన్‌ పనులు పూర్తి చేసుకుని అందుబాటులోకి వచ్చి ట్రాఫిక్‌ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపారు. 17వ ఫ్లై ఓవర్‌ అయిన గచ్చిబౌలి ఐటీ కారిడార్‌ మీనాక్షి, ఐకియాలను కలుపుతూ రూ.466 కోట్ల వ్యయంతో 1.75 కిలో మీటర్ల పొడవున చేపట్టిన శిల్పా లే అవుట్‌ ఫ్లై ఓవర్‌ను నేడు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.

Read Also: Vishnu Manchu: హీరోయిన్ రిచా చద్దా పై బాధను వ్యక్తం చేస్తున్న సినీ ఇండస్ట్రీ

శంషాబాద్ ఎయిర్ పోర్టనుంచి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ వరకు ఔటర్‌ రింగు రోడ్డు ద్వారా గచ్చిబౌలి వరకు ఎలాంటి సమస్యలు లేకుండా నేరుగా చేరుకున్నప్పటికీ అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. అయితే శిల్పా లే అవుట్‌ ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి రానుండటంతో ఇక ప్రయాణికులకు ట్రాఫిక్‌ సమస్య తప్పనుంది.

Show comments