Formula E Case: ఫార్ములా-ఈ రేస్ కేసు.. నేడు ఈడీ విచారణకు కేటీఆర్!
- ఈడీ విచారణకు హాజరుకానున్న కేటీఆర్
- ఉదయం 10.30 గంటలకు ఈడీ కార్యాలయానికి కేటీఆర్
- ఫార్ములా-ఈ రేస్ కేసులో A-1గా కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరుకానున్నారు. ఫార్ములా-ఈ రేస్ కేసులో జనవరి 7న నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు.. 16న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. దీంతో గురువారం ఉదయం 10 నందినగర్‌లోని తన నివాసం నుంచి కేటీఆర్ బయలుదేరి.. 10.30 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకుంటారు.
ఫార్ములా-ఈ రేస్ కేసులో A2, A3గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, బీఎన్ఎల్ రెడ్డిలను ఈడీ ఇప్పటికే విచారించింది. వావారు ఇద్దరు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా ఈడీ ఇవాళ కేటీఆర్‌ని ప్రశ్నిస్తుంది. అరవింద్ కుమార్, బీఎన్ఎల్ రెడ్డి ఇద్దరూ తమ తప్పేమీ లేదని.. కేటీఆర్ బలవంతంతోనే అలా చేశామని చెప్పారు. ఈ నేసథ్యంలో నేడు కేటీఆర్ ఏం చెబుతారన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. ఫెమా రూల్స్‌ని అతిక్రమిస్తూ కేటీఆర్ విదేశాలకు రూ.55 కోట్లు తరలించారని ఆయనపై ఉన్న అభియోగం. ఈ కేసులో కేటీఆర్‌పై ఫెమా ఉల్లంఘనతో పాటు మనీ లాండరింగ్ కేసు కూడా నమోదయింది. ఫార్ములా-ఈ రేస్ కేసులో కేటీఆర్ A-1గా ఉన్నారు.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
కేబినెట్ పర్మిషన్ లేకుండా కేటీఆర్ స్వయంగా నిర్ణయం తీసుకొని రూ.55 కోట్లను విదేశీ కంపెనీకి చెల్లించేలా చేసి.. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనేది ఆయనపై ఉన్న అభియోగం. ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా ఒప్పుకుంటున్నారు. అయితే ఇందులో అవినీతి ఏమీ లేదని, హైదరాబాద్ ప్రతిష్టను పెంచడానికే చేశానని అంటున్నారు. విదేశీ కంపెనీకి డాలర్ల రూపంలో మనీ చెల్లించేలా చెయ్యడం ఫెమా రూల్స్ అతిక్రమించడమే అని ఈడీ పేర్కొంది. ఏ ప్రభుత్వం అయినా నిర్ణయాలను చట్టప్రకారమే తీసుకోవాలని, ప్రతీదీ లెక్క చూపించాలని అంటోంది.
- Tags
- BRS
- ED
- Formula E Case
- ktr
- telangana
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!