NTV Telugu Site icon

Formula E Case: ఫార్ములా-ఈ రేస్ కేసు.. నేడు ఈడీ విచారణకు కేటీఆర్!

Ktr

Ktr

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు హాజరుకానున్నారు. ఫార్ములా-ఈ రేస్‌ కేసులో జనవరి 7న నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు.. 16న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. దీంతో గురువారం ఉదయం 10 నందినగర్‌లోని తన నివాసం నుంచి కేటీఆర్ బయలుదేరి.. 10.30 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకుంటారు.

ఫార్ములా-ఈ రేస్‌ కేసులో A2, A3గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, బీఎన్‌ఎల్ రెడ్డిలను ఈడీ ఇప్పటికే విచారించింది. వావారు ఇద్దరు ఇచ్చిన స్టేట్‌మెంట్స్ ఆధారంగా ఈడీ ఇవాళ కేటీఆర్‌ని ప్రశ్నిస్తుంది. అరవింద్ కుమార్, బీఎన్‌ఎల్ రెడ్డి ఇద్దరూ తమ తప్పేమీ లేదని.. కేటీఆర్ బలవంతంతోనే అలా చేశామని చెప్పారు. ఈ నేసథ్యంలో నేడు కేటీఆర్ ఏం చెబుతారన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. ఫెమా రూల్స్‌ని అతిక్రమిస్తూ కేటీఆర్ విదేశాలకు రూ.55 కోట్లు తరలించారని ఆయనపై ఉన్న అభియోగం. ఈ కేసులో కేటీఆర్‌పై ఫెమా ఉల్లంఘనతో పాటు మనీ లాండరింగ్ కేసు కూడా నమోదయింది. ఫార్ములా-ఈ రేస్‌ కేసులో కేటీఆర్ A-1గా ఉన్నారు.

కేబినెట్ పర్మిషన్ లేకుండా కేటీఆర్ స్వయంగా నిర్ణయం తీసుకొని రూ.55 కోట్లను విదేశీ కంపెనీకి చెల్లించేలా చేసి.. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనేది ఆయనపై ఉన్న అభియోగం. ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా ఒప్పుకుంటున్నారు. అయితే ఇందులో అవినీతి ఏమీ లేదని, హైదరాబాద్ ప్రతిష్టను పెంచడానికే చేశానని అంటున్నారు. విదేశీ కంపెనీకి డాలర్ల రూపంలో మనీ చెల్లించేలా చెయ్యడం ఫెమా రూల్స్ అతిక్రమించడమే అని ఈడీ పేర్కొంది. ఏ ప్రభుత్వం అయినా నిర్ణయాలను చట్టప్రకారమే తీసుకోవాలని, ప్రతీదీ లెక్క చూపించాలని అంటోంది.

Show comments