ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో.. సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా న్యాయం గెలిచిందని ఆయన పేర్కొన్నారు.
Thank You Supreme Court 🙏
Relieved. Justice prevailed
— KTR (@KTRBRS) August 27, 2024
Read Also: PM Modi-Putin telephonic call: పుతిన్‌తో మాట్లాడిన ప్రధాని మోడీ.. ఉక్రెయిన్ పర్యటనపై చర్చ..
కాగా.. ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు ఈరోజు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ, ఈడీ కేసుల్లో కవితకు బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. పలు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. రూ.10 లక్షల విలువైన 2 షూరిటీలు సమర్పించాలని సుప్రీం ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని తెలిపింది. కవిత పాస్‌పోస్ట్ ను అప్పగించాలని సుప్రీంకోర్టు తెలిపింది. కవిత బెయిల్ కు 3 ప్రధాన కారణాలు సుప్రీం కోర్టు తెలిపింది. మహిళకు ఉండే హక్కులను కూడా పరిగణించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది. సీబీఐ తుది ఛార్జ్‌షీట్ దాఖలు చేసిందని, ఈడీ ఛార్జ్ షీట్ వేయలేదని తెలిపింది. ఇక ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో 166 రోజులు కవిత తిహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.
Read Also: Maa Nanna Superhero: దసరాకి ‘మా నాన్న సూపర్ హీరో’ అంటున్న నవ దళపతి
కవిత విడుదల ప్రాసెస్..
నాలుగు గంటలు లోపల ట్రయల్ కోర్టులో షూరిటీ పత్రాలు సమర్పించనున్నారు. ఆ తరువాత ట్రయల్ కోర్టు నుంచి మెయిల్ ద్వారా జైలు అధికారులకు సమాచారం వెళ్తుంది. జైలు అధికారులకు సమాచారం అందాక మరో రెండు మూడు గంటల పాటు జైలులో విడుదల ప్రాసెస్ జరుగుతుంది. కాగా.. రాత్రి 7 గంటల తర్వాత కవిత జైలు నుంచి బయటికి రానున్నారు. ఈరోజు రాత్రికి కవిత, కేటీఆర్, హరీష్ రావు.. ఇతర బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలోనే ఉండనున్నారు. అనంతరం.. రేపు ఉదయం ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం రెండు గంటలకు కవిత, కేటీఆర్, హరీష్ రావు.. ఇతర బీఆర్ఎస్ నేతలు హైదరాబాదుకు రానున్నారు.
