బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. “నీటికి పల్లం ఎలా తెలుసో తెలంగాణ కు నీరు ఎవరు తీసుకు వచ్చారో అందరికి తెలుసు.. తెలంగాణ లో ఏ రైతు ను, ఎద్దును అడిగినా వ్యవసాయం పండుగ ఎవరు చేశారో చెప్తారు.. సీఎం నిన్న రంకెలు వేశాడు.. ఆయన సభ పెట్టాడంటే బూతులతోనే మాట్లాడతాడు.. మా పార్టీ తరుపున మీ సవాలు స్వీకరిస్తున్నాం.. ఎక్కడ చర్చ పెట్టినా వస్తాం.. మీకు కేసీఆర్ అవసరం లేదు.. మేము చాలు.. 72 గంటలు ఇస్తున్నాం.. మీరు ప్రిపేర్ అయి రండి.. సీఎంకు బేసిన్ లు తెలియదు బెండకాయలు తెలియదు.. సమైక్య రాష్ట్రంలో నీళ్లు ఇవ్వలేదు కాబట్టే తెలంగాణ ఉద్యమం పుట్టింది.. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో నీళ్లు ఆంధ్రకు, నిధులు ఢిల్లీకి, నియామకాలు ఆయన అనునాయులకు వచ్చాయి.. ఇందిరమ్మ రాజ్యం గొప్పతనం తెలియాలి అంటే బట్టలు విప్పి కొడతాం అన్నారు.. బనకచర్ల ద్వారా మీ గురువు చంద్రబాబు తీసుకెళ్తుంటే మీ తీరు తెలంగాణ సమాజం చూస్తూనే ఉంది.
Also Read:Dhoolpet: దేవుడి చిత్రపటాల వెనుక గంజాయి పెట్టి.. పూజలు చేస్తున్నట్టు డ్రామా.. పోలీసుల ఎంట్రీతో
బురద జల్లి తప్పించుకునే అలవాటు సీఎం కి ఉంది.. 8 వ తారీఖు 11 గంటలకు సోమజిగూడా ప్రెస్ క్లబ్ కు మేము వస్తాము.. మీరు రండి మీడియా ముందే చర్చిద్దాం.. కేసీఆర్ ప్రభుత్వం నాట్లు వచ్చినప్పుడు రైతు బంధు ఇచ్చేది… ఓట్లు వచ్చేముందు రైతు భరోసా ఇస్తుంది కాంగ్రెస్.. ఇప్పటి వరకు రైతులకు ఎకరానికి 19 వేలు ఎగ్గొట్టారు. అన్నదాతకు సున్నం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం.. మందికి పుట్టిన బిడ్డలు నా బిడ్డలు అనడానికి సిగ్గు లేదా.. మేము ఇచ్చిన ఉద్యోగాలు మీరు ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు.. అశోక్ నగర్ లో చర్చకు వస్తావా.. ఈ మూడు రోజులు మీకు టైం ఇస్తున్నాం.. అప్పటివరకు మీరు చెప్పకుంటే.. 8వ తేదీన మేము సోమజిగూడా ప్రెస్ క్లబ్ లో సిద్ధం గా ఉంటాం.. మీలాగా మందబలంతో కాకుండా 10,15 మంది తో వస్తాం.. ఈయన ఇచ్చే డబ్బులతో ఢిల్లీ టకీ టకీ అని మోగుతున్నాయి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పినట్లు చంద్రబాబు కోవర్ట్ రేవంత్ రెడ్డినే.. ఆ ఎమ్మెల్యే చాలా కరెక్టు గా చెప్పాడు.. అలా చెప్పిన ఎమ్మెల్యేను అభినందిస్తున్నాను” అని కేటీఆర్ తెలిపారు.
