Site icon NTV Telugu

KTR: బడి కట్టించాం… రాజకీయాలకతీతంగా గుడి పూర్తిచేసి గ్రామానికి అంకితం చేస్తాం

Ktr School

Ktr School

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోదురుపాకలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తన అమ్మమ్మ తాతయ్య జోగినిపల్లి లక్ష్మి కేశవరావు జ్ఞాపకార్థం నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని చొప్పదండి ఎమ్మెల్యే సత్యంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. బడి కట్టించాం… రాజకీయాలకతీతంగా గుడి పూర్తిచేసి గ్రామానికి అంకితం చేస్తామని ఆయన వెల్లడించారు. కొదురుపాకకు వస్తే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని, మిడ్ మానేర్‌లో కొదురుపాక మునిగిపోతుందంటే అందరికంటే ఎక్కువ బాధపడ్డ వ్యక్తిని నేనే అని ఆయన అన్నారు. ఎగువ మానేర్‌లో నాయనమ్మ ఇల్లు, మిడ్ మానేర్ అమ్మమ్మ ఇల్లు, లోయర్ మానేర్‌లో ఇంకో అమ్మమ్మ ఇల్లు కోల్పోయామని ఆయన వెల్లడించారు. మూడు ప్రాజెక్టులో మూడు ఇళ్ళను కోల్పోయామని కేటీఆర్‌ అన్నారు. నిర్వాసితుల బాధలు తనకు తెలుసు అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. మిడ్ మానేర్ నిర్వాసితుల సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వంలో తాము లేకపోయినా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి పరిష్కరించే దిశగా కృషి చేస్తా అని ఆయన హామీ ఇచ్చారు.

FNCC: ఏపీ సీఎంతో భేటీ.. 25 లక్షలు విరాళం అందించిన ఎఫ్ఎన్సీసీ

Exit mobile version