రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోదురుపాకలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తన అమ్మమ్మ తాతయ్య జోగినిపల్లి లక్ష్మి కేశవరావు జ్ఞాపకార్థం నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని చొప్పదండి ఎమ్మెల్యే సత్యంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బడి కట్టించాం… రాజకీయాలకతీతంగా గుడి పూర్తిచేసి గ్రామానికి అంకితం చేస్తామని ఆయన వెల్లడించారు. కొదురుపాకకు వస్తే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని, మిడ్ మానేర్‌లో కొదురుపాక మునిగిపోతుందంటే అందరికంటే ఎక్కువ బాధపడ్డ…