Site icon NTV Telugu

KTR: కాళేశ్వరంను చిల్లర రాజకీయాలకోసం వాడుతున్నారు.. కేటీఆర్ బోల్డ్ కామెంట్స్..!

Ktr

Ktr

KTR: కాళేశ్వరం ప్రాజెక్టుపై కొనసాగుతున్న దర్యాప్తు నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యల్లో ముఖ్యంగా కొన్ని కీలకాంశాలు చర్చనీయాంశమయ్యాయి. ఎంత వర్షం వచ్చినా, ఎంత వాటర్‌ ఫ్లో వచ్చినా కాళేశ్వరం తట్టుకుంది. అలాంటి ప్రాజెక్టును కాంగ్రెస్ నాయకులు కావాలనే డామేజ్ చేసి ఉంటారు. నాకు అదే అనుమానం ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read Also: Gold Prices: బంగారు ప్రియలకి ఝలక్.. భారీగా పెరిగిన పుత్తడి ధర..!

ప్రజల ఉపయోగానికి నిర్మించిన ప్రాజెక్టును రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుందని ఆరోపించారు. ఇరిగేషన్‌ విషయమై కేసీఆర్‌ కి ఉన్న అవగాహన ఏ నేతకీ లేదు. అలాంటి వ్యక్తిని కమీషన్ ముందు ప్రశ్నించడం అంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేయడమే అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రెవంత్ రెడ్డి ప్రభుత్వంపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కేబినెట్ ఎలా పనిచేస్తుందో కూడా రేవంత్ రెడ్డికి తెలియదు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఫార్ములా ఈ రేసింగ్ వంటి అంశాలతో నాటకాలు ఆడుతున్నారు. నిజం నిలకడగా బయటపడుతుందని వ్యాఖ్యానించారు.

Read Also: KCR Convoy: కేసీఆర్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం.. పాక్షికంగా ధ్వంసమైన రెండు కార్లు..!

ఇక కమీషన్ విచారణపై స్పందిస్తూ.. కక్ష సాధింపే ఈ విచారణ వెనుక ఉంది. కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలా చేస్తున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ నేతలు హరీశ్ రావు సమాధానాలతోనే షాక్‌ అయ్యారు. వాళ్ల ఫీజ్‌లు ఎగిరిపోయాయని అన్నారు. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో రాజకీయ నేతల పరస్పర విమర్శలు మరింత వేడి పెంచుతున్నాయి.

Exit mobile version