KTR: తెలంగాణలో పేద ప్రజల ఇళ్లపై బుల్డోజర్లతో నిర్వహిస్తున్న కూల్చివేతలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్రంగా విమర్శించారు. వరంగల్ నగరంలో రోడ్డుకే ఆనుకుని ఉన్న పేదవారి ఇళ్లను కూల్చివేసిన ఘటనలపై సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (X) లో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని కేటీఆర్ నేరుగా ప్రశ్నించారు. “హలో రాహుల్ గాంధీ, మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుల్డోజర్ కంపెనీలతో రహస్య ఒప్పందం ఉందా?” అంటూ ఆయన తన పోస్ట్‌ను ప్రారంభించారు. పేద ప్రజల ఇళ్లపై, వారి జీవనోపాధిపై రోజూ దాడులు చేస్తున్న ఈ అమానవీయ చర్యలకు మీరు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Also: IPL 2025: బీసీసీఐ శతవిధాలా ప్రయత్నాలు.. ఐపీఎల్లో విదేశీ ఆటగాళ్లు ఆడటం అనుమానమే.!
వరంగల్‌లో దారివెంట ఉన్న ఇళ్లను ఎందుకు కూల్చారు? మిస్ వరల్డ్ అందాల పోటీ కోసం మార్గాన్ని అందంగా చూపించడానికేనా ఈ చర్యలు చెప్పట్టారా? ఇది ప్రజాపాలనేనా? మరోవైపు, రూ.200 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రాజభవనాల్లో విందులు పెడతారు… అదే సమయంలో పేదల జీవితాలను బుల్డోజర్ల కింద నలిపేస్తారా? అంటూ పలు ప్రశ్నలను కేటీఆర్ సంధించారు. ఇలాంటి చర్యలు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్, ఇది పూర్తిగా అమానవీయ చర్యగా అభివర్ణించారు. ఈ సిగ్గులేని కాంగ్రెస్ ప్రభుత్వం నుండి నేను సమాధానాలు కోరుతున్నానని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు, సోషల్ మీడియా వేదికపై పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి.
Read Also: Meizu Note 16 Series: తక్కువ ధరకే భారీ ఫీచర్లతో వచ్చేసిన మెయిజు నోట్ 16 సిరీస్..!
Hello @RahulGandhi Ji, does your Congress Govt have a secret contract with Bulldozer companies?
What's behind this incessant drive to destroy people's homes & livelihoods on a daily basis? Why are demolitions being carried out in Warangal?
People are being told that it's to… pic.twitter.com/XnUjDzdgFe
— KTR (@KTRBRS) May 14, 2025