Minister KTR: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం.. అవకతవకలు జరిగితే బాధ్యత అధికారులదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగితే పూర్తిస్థాయి బాధ్యత అధికారులదే అని మంత్రి కేటీఆర్ అన్నారు. తప్పు చేసిన అధికారులను ప్రభుత్వ ఉద్యోగం నుంచి తీసి వేసే స్థాయిలో కఠిన చర్యలు ఉంటాయని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ఈ మొత్తం ప్రక్రియలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసారు. ఎక్కడా తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదే అన్నారు. ఇండ్ల ఎంపికలో ఏదైనా ఇబ్బందులు జరిగితే వాటిని ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకొస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలో గృహలక్ష్మి పథకం కూడా త్వరలో ప్రారంభమవుతుందన్నారు. హైదరాబాద్ నగరంలో గృహలక్ష్మి కార్యక్రమానికి కొన్ని మార్పు చేర్పులు చేయాలని మంత్రులు ముఖ్యమంత్రిని కోరామన్నారు. వారు సూచించిన మార్పులకు ముఖ్యమంత్రి సూచనప్రాయంగా అంగీకరించారని తెలిపారు. హైదరాబాద్ నగరంలో నోటరీ ప్రాపర్టీల అంశంలోనూ త్వరలో పూర్తి మార్గదర్శకాలు వస్తాయన్నారు. 58, 59 జీవోల ద్వారా కూడా పెద్ద ఎత్తున ప్రజలకు ఉపశమనం లభించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ రకాల కార్యక్రమాల ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణం, పట్టాల రెగ్యులరైజేషన్, నోటరీ ఆస్తుల అంశం వంటి కార్యక్రమాల ద్వారా ప్రతి నియోజకవర్గానికి కనీసం 15 నుంచి 20వేల మందికి లబ్ధి కలిగిందన్నారు. మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న కబ్జాలను తొలగించి, వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని కూడా వేగంగా ముందుకు తీసుకువెళ్తామని కేటీఆర్ అన్నారు.
Read also: Governor Tamilisai: నాది కన్నింగ్ ఆటిట్యూడ్ కాదు.. రాజకీయ ఉద్దేశాలు ఏమీ లేవు
Also Read
- India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్‌కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
- Mohammed Siraj: సిక్సర్ల హిట్టర్..! సిరాజ్ సంచలన బ్యాటింగ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే..!
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
- Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం భారతదేశంలో ఎక్కడ లేదని అన్నారు. 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో పక్కా ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చే కార్యక్రమం దేశంలోని ఏ రాష్ట్రంలో లేదని తెలిపారు. హైదరాబాద్ నగరం ఒక్కొక్క 50 లక్షల విలువైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదల కోసం ఉచితంగా అందిస్తున్నామన్నారు. హైదరాబాద్లో నిర్మాణం చేస్తున్న లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం విలువ 9100 కోట్లు ఉందని తెలిపారు. ప్రభుత్వానికి అయిన ఖర్చు 9100 కోట్లు, కానీ వాటి మార్కెట్ విలువ దాదాపు 50 వేల కోట్ల రూపాయలు పైనే అన్నారు. హైదరాబాద్ నగరంలోని పేద ప్రజలకు సుమారు 50,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వం మాదే అన్నారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని జిహెచ్ఎంసి అధికారులు కష్టపడి పూర్తి చేస్తున్నారు, వారికి అభినందనలు అని తెలిపారు. మొదటి దశ 11,700 వేల ఇండ్లను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేదలకు అందించామన్నారు. ఈనెల 21వ తేదీన రెండవ దశ దాదాపు మరో 13,300 ఇండ్లను మరోసారి అందించనున్నామని తెలిపారు. అత్యంత పారదర్శకంగా అర్హులైన పేదలకు మాత్రమే అందిస్తున్నామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపిక ప్రక్రియలో ఎవరి ప్రమేయం లేదని అన్నారు. అర్హులైన లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ప్రమేయం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికను పూర్తిస్థాయి బాధ్యత అధికారులకే అప్పగించిందని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులందరి వివరాలతో కంప్యూటర్ ఆధారిత డ్రా తీస్తున్నామని, లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామన్నారు. ఎంపిక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా మీడియా ముందు నిర్వహిస్తున్నామన్నారు.
Minister KTR: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపిక ప్రక్రియలో ఎవరి ప్రమేయం లేదు
తాజావార్తలు
-
India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్‌కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
-
Venky Atluri : OTTలో వెబ్ సిరీస్‌తో భారీ ప్రయోగం చేయబోతున్న వెంకీ అట్లూరి
-
Jharkhand JPSC Exam Scam: జార్ఖండ్ JPSC పరీక్షలో అవకతవకలు.. రంగంలోకి ఈడీ, దర్యాప్తు ముమ్మరం
-
NTA Recruitment: ఉద్యోగార్థులకు అలెర్ట్.. కంటెంట్, మీడియా, రీసెర్చ్, ఫైనాన్స్‌లో జాబ్స్‌కి నోటిఫికేషన్..!
-
Mohammed Siraj: సిక్సర్ల హిట్టర్..! సిరాజ్ సంచలన బ్యాటింగ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే..!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!