NTV Telugu Site icon

KTR: తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ తన రక్తాన్ని రంగరించి, చెమటను ధార పోశారు..

Ktr

Ktr

వరంగల్ లోక్ సభ నియోజకవర్గ సన్నాహాక సమావేశానికి హాజరైన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజలను వంచించాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి సినిమా ఇంకా మొదలు కాలేదు.. ఆసలు సినిమా ముందుంది అని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ తన రక్తాన్ని రంగరించారు.. చెమట ధార పోశారు అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ 420 హామీల్లో ఇప్పటికే కొన్నింటినీ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని ఆయన తెలిపారు.

Read Also: Minister Seethakka: ఆదిలాబాద్ జిల్లా అక్షర క్రమంలో ముందుండి అభివృద్ధిలో వెనుకబడింది

నిరుద్యోగ భృతి హామీ ఇవ్వనే లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీ వేదిగా అబద్దం చెప్పారు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని వాళ్ళ 420 హామీలతోనే ఎండగట్టాలి అని పిలుపునిచ్చారు. సీఎం జిల్లాలు రద్దు చేస్తామని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు.. జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజుల్లోనే కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత మొదలైంది అని కేటీఆర్ పేర్కొన్నారు.