NTV Telugu Site icon

KTR Reacts on Allu Arjun Issue: ఇదంతా గవర్నమెంట్ ప్లాన్.. అల్లు అర్జున్ అంశంపై కేటీఆర్ రియాక్షన్

Ktr Reacts On Allu Arjun Issue

Ktr Reacts On Allu Arjun Issue

అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ప్రజా సమస్యలపై నుంచి దృష్టి మళ్లించేందుకు ఈ అంశాన్ని ప్రభుత్వం తెర పైకి తెచ్చిందన్నారు. అందుకే రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళ పై మాట్లాడారని ఆరోపించారు. రాష్ట్రంలో జరిగిన మరణాలపైన రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చనిపోయిన గురుకుల పాఠశాల విద్యార్థులకు.. ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

READ MORE: TTD: టీటీడీ ప్రతిపాదలనకు సీఎం గ్రీన్‌ సిగ్నల్.. తెలంగాణ ప్రజాప్రతినిధులకు గుడ్‌న్యూస్‌..

వీళ్లందరివి కుటుంబాలు కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. సినిమా వాళ్లపైన పడి అటెన్షన్ డైవర్షన్ కోసం ముఖ్యమంత్రి పాకులాడారని ఆరోపించారు. సినిమా వాళ్ళ నుంచి సెటిల్‌మెంట్ చేసుకొని ఇప్పుడు సైలెన్స్ గా ఉన్నారని ఆరోపించారు. సినిమా వాళ్ళ తోపాటు ఆత్మహత్యలు చేసుకున్న గురుకుల విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, రైతన్నలు, నేతన్నల మరణాల పైన స్పందించాలని డిమాండ్ చేశారు. వీళ్లకి కూడా కనీసం రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు.

READ MORE: Game Changer: మెగాభిమానులకు దిల్ మామ మార్క్ ‘హై’

ఇదిలా ఉండగా.. పుష్ప 2 బెనిఫిట్​ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్​దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఆమె కుమారుడు ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంలో ఈ నెల 13న చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్​ను అరెస్ట్​ చేశారు. అనంతరం పోలీస్ ​స్టేషన్‌​కు తరలించి విచారించారు. ఆ తర్వాత గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం అల్లు అర్జున్‌ను చంచల్ గూడ జైలుకు తరలించారు. మరోవైపు తనపై చిక్కడపల్లి పోలీసులు పెట్టిన కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్​ హైకోర్టులో క్వాష్​ పిటిషన్​ వేయగా దీనిపై విచారించిన హైకోర్టు ఈ నెల 30 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

Show comments