KTR: రెండోసారి కూలిన కాఫర్ డ్యామ్.. పోలవరాన్ని కూలవరం అనే దమ్ము వాళ్లకు ఉందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలవరం కాఫర్ డ్యామ్ రెండోసారి కూలలేదా?.. కాంగ్రెస్, బీజేపీకి పోలవరాన్ని కూలవరం అనే దమ్ముందా? అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కాళేశ్వరం విషయంలో ఒక విధానం, పోలవరం విషయంలో మరో విధానమా? అని ప్రశ్నించారు.. పోలవరం కాఫర్ డ్యామ్‌పై ఎన్డీఎస్ఏ మౌనం ఎందుకు? అని నిలదీశారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు.
READ MORE: MP: టెన్షన్.. టెన్షన్.. దర్గాపై హిందూ జెండా ఎగరేసిన దుండగులు..
Also Read
“జాతీయ హోదా ఇచ్చి మరీ.. సాక్షాత్తూ ఎన్డీఏ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం కాఫర్ డ్యామ్, రెండో సారి కొట్టుకుపోయినా NDSA కు కనిపించడం లేదా? కాళేశ్వరంలోని మేడిగడ్డలో రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే కూలేశ్వరం అని కారుకూతలు కూసిన కాంగ్రెస్-బీజేపీ నేతలకు “పోలవరంను.. కూలవరం” అనే దమ్ము ధైర్యం ఉందా..? తెలంగాణకు వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక నీతి.. పోలవరం ప్రాజెక్టుకు మరో నీతా ? అసెంబ్లీ ఎన్నికల వేళ అత్యంత అనుమానాస్పదంగా కుంగిన మేడిగడ్డ పిల్లర్లపై కేవలం 24 గంటల్లోపే NDSA ను దించి బీఆర్ఎస్ పై బురజల్లిన బీజేపీ నేతలు.. కళ్లముందు రెండోసారి కొట్టుకుపోయిన పోలవరం కాఫర్ డ్యామ్ పై ఎందుకు మౌనంగా ఉన్నారు ?ఏకంగా 10 అడుగుల వెడల్పు.. 7 నుంచి 8 అడుగుల లోతుకు కుంగిన పోలవరం కాఫర్ డ్యామ్ ను గుట్టుచప్పుడు కాకుండా ఏపీలో యుద్ధప్రాతిపదికన రిపేర్ చేస్తుంటే.. తెలంగాణలో మాత్రం 20 నెలలు కావస్తున్నా మేడిగడ్డ బ్యారేజీ వద్ద తట్టెడు సిమెంట్ కు దిక్కులేకపోవడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి మూర్ఖత్వమే.2020లో పోలవరం డయాఫ్రం వాల్ రెండేండ్లకే కొట్టుకుపోయినా ఇప్పటికీ ఊలుకూ లేదు, పలుకూ లేదు. మరోసారి ఏపీలో పోలవరం కాఫర్ డ్యామ్ గోదావరిపాలైనా, ఇటు తెలంగాణలో ఎస్.ఎల్.బీ.సీ. టన్నెల్ కుప్పకూలి 8 మంది మరణించినా ఇప్పటికీ ఎన్.డి.ఎస్.ఏ అడ్రస్ లేదు. పంజాబ్ నే తలదన్నే స్థాయిలో తెలంగాణలో వ్యవసాయ విప్లవాన్ని సృష్టించి , దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రైతును తీర్చిదిద్దిన కేసీఆర్ గారిపై కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టుపై Congress – BJP పార్టీలు సాగిస్తున్న మూకుమ్మడి కుట్రలను కాలరాస్తాం.. తెలంగాణకు జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టును కంటికి రెప్పలా కాపాడుకుంటాం..” అని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు.
READ MORE: Heart Attack Symptoms: మీకు ఈ లక్షణాలు ఉన్నాయా? గుండెపోటు తప్పదట..!
జాతీయ హోదా ఇచ్చి మరీ.. సాక్షాత్తూ NDA ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం కాఫర్ డ్యామ్, రెండో సారి కొట్టుకుపోయినా NDSA కు కనిపించడం లేదా ?
కాళేశ్వరంలోని మేడిగడ్డలో రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే కూలేశ్వరం అని కారుకూతలు కూసిన కాంగ్రెస్-బీజేపీ నేతలకు “పోలవరంను.. కూలవరం” అనే దమ్ము…
— KTR (@KTRBRS) August 16, 2025
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?