KTR: శాసనసభ కాదు.. అది దుశ్శాసన సభ: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని, పోలీసుల తీరును తీవ్రంగా నిరసిస్తూ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. తాము సభలో ఎలాంటి అన్ పార్లమెంటరీ పదాలు మాట్లాడలేదని, రాహుల్ గాంధీ తరహాలోనే టీ-షర్టులతో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఎంత రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని కేసీఆర్ తమకు సూచించారని, కానీ రేవంత్ రెడ్డి ఆయన పోలీస్ బృందంతో కలిసి అత్యంత కిరాతకంగా వ్యవహరించారని మండిపడ్డారు.
సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని, పోలీసు బలగం దుర్మార్గమైన చర్యలను ప్రజలంతా గమనించారని అన్నారు. ఈ దాడి వెనుక ముమ్మాటికీ సీఎం రేవంత్ రెడ్డి హస్తమే ఉందన్న కేటీఆర్, టీ-షర్టులపై అభ్యంతరకర పదాలు ఉన్నాయనడానికి డీసీపీ శిల్పవల్లి ఎవరని ప్రశ్నించారు. ఏ రూల్ ప్రకారం తమను అడ్డుకున్నారో చెప్పకుండా, రేవంత్ రెడ్డిని నిలదీస్తున్నారనే నెపంతోనే ఈ అడ్డంకులు సృష్టించారని ధ్వజమెత్తారు. శాసనసభను దుశ్శాసన సభగా మార్చేశారని, ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరలేపిందని విమర్శించారు.
Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
స్పీకర్ స్థానంలో ఉండి వివక్ష చూపించడం తగదని, సీఎంను విమర్శిస్తే మైక్ ఇవ్వబోమనడం సరికాదని హితవు పలికారు. గలాటాకు ఆద్యుడైన ముఖ్యమంత్రి నిరసనకారులకు, మహిళా నేతలకు క్షమాపణ చెప్పే వరకు సభలో నిలదీస్తామని తేల్చిచెప్పారు. నాడు డి.కె. అరుణకు తాము క్షమాపణ చెప్పిన విషయాన్ని, తాతా మధు విచారణ వ్యక్తం చేయాలని కేసీఆర్ ఆదేశించిన అంశాన్ని గుర్తుచేశారు. దళితులపై ప్రేమ ఉంటే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై చర్చ పెట్టాలని సవాల్ విసిరారు.
సభలో బూతులు మాట్లాడే రేవంత్ రెడ్డి నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వంద రోజుల్లో హామీలు అమలు చేయని రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని, ఈ దాడికి నిరసనగా తాము బీఏసీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. గవర్నర్ అపాయింట్మెంట్ కోరామని, కాంగ్రెస్-బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తే అవసరమైతే ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!