NTV Telugu Site icon

KTR : మహబూబ్ నగర్ గడ్డపై ఎగిరిన గులాబీ జెండా

Ktr

Ktr

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గెలుపు పై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ వేదికగా.. ‘మహబూబ్ నగర్ గడ్డపై ఎగిరిన గులాబీ జెండా.. సీఎం సొంత జిల్లాల్లో బీఆర్ఎస్ సాధించిన ఈ గెలుపు.. మారుతున్న తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో కీలక మలుపు.. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించిన నవీన్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు.. పార్టీ విజయం కోసం పని చేసిన ప్రతి ఒక్క పార్టీ నాయకునికి, ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు.. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు..’ అని ఆయన ట్విట్‌ చేశారు.

అంతేకాకుండా.. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని ఎమ్మెల్సీ స్థానం గెలుచుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్.. ఈ గెలుపు మా పైన బాధ్యతలు మరింత పెంచిందన్నారు. ఈ విజయం మరిన్ని విజయాలకు దారితీస్తుందని విశ్వసిస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేసిన కేటీఆర్.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న వేళ అద్భుత గెలుపు హర్షణీయమన్నారు. సీఎం సొంత జిల్లాల్లో బీఆర్ఎస్ సాధించిన ఈ గెలుపు.. మారుతున్న తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో కీలక మలుపు అని ఆయన వ్యాఖ్యానించారు.

 

అధికార పార్టీ ప్రలోభాలకు నిలువునా పాతరేసిన ఎన్నిక ఇది అని, ఆరునెలల్లోనే కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపిన ఫలితమిదన్నారు. నాడైనా.. నేడైనా.. ఏనాడైనా.. తెలంగాణ ఇంటిపార్టీ బీఆర్ఎస్ మాత్రమే.. ఈ గడ్డకు శ్రీరామరక్ష అని మరోసారి తేల్చిచెప్పిన శుభతరుణమిదని, మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గులాబీ పార్టీ గెలుపు కోసం శ్రమించిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ మరోసారి గుండెల నిండా కృతజ్ఞతలు… శుభాకాంక్షలు… అభినందనలు తెలిపారు.

Show comments