Site icon NTV Telugu

KTR: భారతదేశానికి వన్నె తెచ్చిన నేత పీవీ నర్సింహ రావు..

Ktr Tributes

Ktr Tributes

తెలుగు వారికి, తెలంగాణ వారికి, భారతదేశానికి వన్నె తెచ్చిన నేత పీవీ నర్సింహ రావు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తో కలిసి అప్పుల్లో కూరుకుపోయిన భారత దేశాన్ని గాడిన పెట్టీ తన వంతు సేవ దేశానికి అందించారు.. పీవీ ఆదర్శాలకు అనుగుణంగా పనిచేయాలి.. ఢిల్లీలో పీవీ ఘాట్ నిర్మించాలి అని ఆయన డిమాండ్ చేశారు. పీవీ గారికి భారతరత్న ఇచ్చి గౌరవించాలి..కాంగ్రెస్ చేసిన అన్యాయం ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దాలని కేంద్ర ప్రభుత్వాని మాజీ ఐటీ మంత్రి కోరారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే డిమాండ్ చేశామో ఇప్పుడు కూడా అదే అడుగుతున్నాం.. పీవీ నర్సింహ రావుకి సముచిత స్థానం కల్పించాలి అంటూ కేటీఆర్ చెప్పారు. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పీవీ నరసింహా రావు అని ఆయన అన్నారు. భూమిని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి పీవీ.. పేదలకు భూములు పంచడానికి పీవీ బలమైన పునాదులు వేశారు.. పీవీ మన మధ్య లేకపోయినా వారి సంస్కరణలు సదా ఆచరణీయం అని కేటీఆర్ పేర్కొన్నారు.

Exit mobile version