NTV Telugu Site icon

KTR : కాంగ్రెస్‌పై మరోసారి కేటీఆర్‌ విమర్శనాస్త్రాలు

Ktr

Ktr

ట్విట్టర్‌ వేదికగా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌. మేడిగడ్డ ప్రాజెక్ట్‌పై గత కొన్ని రోజులు కాంగ్రెస్‌ చేస్తున్న ప్రచారం నిజం కాదని.. ఇప్పుడు ఇదే అందుకు నిదర్శనమంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ట్విట్టర్‌లో ‘నిన్నటి దాకా… మేడిగడ్డ మేడిపండులా మారింది అన్నారు..అసలు రిపేర్ చేయడం అసాధ్యం అన్నారు. మరమ్మత్తులు చేసినా.. ఇక పనికి రాదన్నారు.లక్షకోట్లు బూడిదలో పోసిన పన్నీరు అన్నారు. వర్షాకాలంలో వరదకు కొట్టుకుపోతది అన్నారు.అన్నారం బ్యారేజీ కూడా కూలిపోతది అన్నారు. నేడు మాత్రం.. మేడిగడ్డ మరమ్మత్తులు పూర్తి అంటున్నారు..అంటే… ఇంతకాలం కాంగ్రెస్ చేసింది.. విష ప్రచారమని తేలిపోయింది.. 8 నెలల నుంచి చేసింది.. కాలయాపనే అని రుజువైపోయింది..

రిపేర్ల మాటున జరిగింది.. చిల్లర రాజకీయమని వెల్లడైపోయింది.. ఇకనైనా.. కేసిఆర్ గారి జల సంకల్పాన్ని.. హేళన చేసిన వారు క్షమాపణలు చెప్పాలి.. వరప్రదాయిని లాంటి ప్రాజెక్టుపై.. విషం చిమ్మిన వారు లెంపలేసుకోవాలి.. కల్పతరువు లాంటి ప్రాజెక్టుపై.. కుట్రలు చేసిన వారు తప్పు ఒప్పుకోవాలి.. తెలంగాణకే తలమానికమైన ప్రాజెక్టును తప్పుబట్టిన వారు ముక్కు నేలకు రాయాలి… జై తెలంగాణ.. జై కాళేశ్వరం..’ అని పోస్ట్‌ చేశారు కేటీఆర్‌.