NTV Telugu Site icon

KTR: తీహార్ జైలులో వున్న కవితను కలిసిన కేటీఆర్..

Ktr Kavitha

Ktr Kavitha

KTR: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తీహార్ జైలులో వున్న ఎమ్మెల్సీ కవితకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. శుక్రవారం కవితను మర్యాదపూర్వకంగా కలిసారు. అలాగే కవిత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆమెను కలిసిన అనంతరం కేటీఆర్ హైదరాబాద్‌కు తిరుగు పయనం అయ్యారు. కాగా, ఇటీవల కవితకు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్‌ను మరో రెండు వారాల పాటు పొడిగించిన సంగతి తెలిసిందే.

Read also: Alleti Maheshwar Reddy: పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలి.. మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

ఢిల్లీ లిక్కర్ సీబీఐ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవిత సీబీఐ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరో సారి పొడిగించిన విషయం తెలిసిందే. కాగా సీబీఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను రౌస్‌ అవెన్యూ న్యాయస్థానం అంగీకరించింది. ఈ మేరకు సీబీఐ కేసులో ఈ నెల 21 వరకు కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. మరోవైపు.. కవిత చదువుకోవడానికి కొత్తగా తొమ్మిది పుస్తకాలు కావాలని కోర్టును కోరింది. ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తిని రౌస్ రెవిన్యూ కోర్టు అంగీకరించింది. తదుపరి విచారణను జూన్ 21వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. అదే రోజు సీబీఐ చార్జిషీట్ పరిగణనలోకి తీసుకునే అంశంపై రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది.
Sehwag-Shakib: సెహ్వాగ్‌ ఎవరో నాకు తెలియదు.. షకీబ్‌ అల్ హసన్ కౌంటర్‌!