NTV Telugu Site icon

KTR : కేటీఆర్‌ లంచ్‌మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు..

Ktr

Ktr

KTR : ఫార్ముల ఈ కార్‌ రేస్‌ కేసులో హైకోర్టు తీర్పుతో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు లాయర్‌ను అనుమతించాలని కోరుతూ లంచ్‌ మోహన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే… కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి కీలక ఆదేశాలు ఇచ్చారు. సీసీ టీవీ పర్యవేక్షణలో కేటీఆర్‌ విచారణ జరపాలన్న న్యాయస్థానం.. విచారణ జరుగుతుండగా లైబ్రరీ రూంలో లాయర్‌ కూర్చునేందుకు హైకోర్టు అనుమతించింది.

OG Movie : పవన్ కోసం దిగొచ్చిన శింబు.. ఈ సాంగ్ వేరే లెవల్

కేటీఆర్‌ ఓగదిలో, లాయర్‌ మరో గదిలో ఉండాలని హైకోర్టు సూచించింది. ఆడియో, వీడియో రికార్డింగ్‌కు హైకోర్టు అనుమతివ్వలేదు. అయితే.. ఏమైనా అభ్యంతరాలుంటే కోర్టుకు రావొచ్చన్న హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు. ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-కార్‌ రేస్ కేసులో కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏసీబీ కేసును కొట్టివేయాలని కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత, ఆ తీర్పుపై న్యాయ నిపుణులతో సలహాలు తీసుకుని సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు నిర్ణయించుకున్నారు.

No More Kingfisher Beers : మందుబాబులకు వెరీ.. వెరీ.. బ్యాడ్‌ న్యూస్‌.. ఇక నో KF బీర్స్‌

Show comments