Site icon NTV Telugu

KTR: సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను తీసుకురండి.. బండి సంజయ్‌కు కేటీఆర్‌ లేఖ

Ktr

Ktr

KTR Letter to Union Minister Bandi Sanjay: ఈసారి కేంద్ర బడ్జెట్‌లో సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను తీసుకురావాలని.. కేంద్రమంత్రి బండి సంజయ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. పదేళ్లుగా ప్రతి బడ్జెట్‌లో కేంద్రం తెలంగాణకు మొండిచెయ్యి చూపిందని కేటీఆర్‌ లేఖలో పేర్కొన్నారు. అనేక సార్లు పవర్‌లూమ్‌ క్లస్టర్ కోసం పది సార్లు కేంద్రానికి లేఖలు, స్వయంగా కలిసి కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఈసారి అయినా సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను తెప్పించండి అంటూ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిగా మీకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని బండి సంజయ్‌కు సూచించారు. సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తే ఇక్కడి నేతన్నల కష్టాలు కొంత మేరకు తీరుతాయన్నారు.

Read Also: Ponnam Prabhakar: ప్రతి పక్షాల ఉచ్చులో నిరుద్యోగులు పడొద్దు..

క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన నైపుణ్యం కలిగిన కార్మికులు, వనరులు ఈ ప్రాంతంలో పుష్కలంగా ఉన్నాయని కేటీఆర్‌ తెలిపారు. కాంగ్రెస్ పాలకుల వైఫల్యం వల్ల చేనేత రంగం సంక్షోభంలో ఉందని విమర్శించారు. నేతన్నలను ఆదుకోవడంలో రాష్ట్ర సర్కారు ఫెయిల్ అయిందన్నారు. ఈ సారి కేంద్ర బడ్జెట్ లో సిరిసిల్లకు గుడ్ న్యూస్ వచ్చేలా చూడాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు సూచించారు.

Exit mobile version