KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్‌కి కేటీఆర్ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: రాష్ట్రంలో పంట కొనుగోళ్ల సంక్షోభంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి” అంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పంటలు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించిన కేటీఆర్, కొనుగోలు కేంద్రాల్లో రైతులు మరణిస్తున్న ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలలు గడిచినా ప్రభుత్వం స్పందించడం లేదని, ముఖ్యమంత్రి ఇంకా మొద్దు నిద్రలోనే ఉన్నారని వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించిన ఆయన, రాష్ట్రంలో రోడ్డెక్కని రైతు లేడని, రాస్తారోకో జరగని రహదారి లేదని విమర్శించారు. రైతులు తమ పంటలను తామే తగలబెట్టుకునే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గన్నీ బ్యాగుల కొరత, కొనుగోలు కేంద్రాల్లో తరుగుల వ్యవహారం, రైతులకు బోనస్ చెల్లింపుల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. పంటలు కొనలేని పరిస్థితి ఉంటే రైతులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో మృతి చెందిన రైతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని, ఈ నెల 23న జరిగే క్యాబినెట్ సమావేశంలో రైతుల సమస్యలపై నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్ కోరారు. ప్రతి గింజను కొనుగోలు చేసి రైతులకు వెంటనే చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. “కాంటా కూడా పెట్టని కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల చేతిలో కౌంట్‌డౌన్ ప్రారంభమైంది” అంటూ హెచ్చరించిన కేటీఆర్, సీఎం రేవంత్ చరిత్రలో రైతు ద్రోహిగా మిగలొద్దని సూచించారు. చివరగా “జై కిసాన్.. జై తెలంగాణ” అంటూ తన లేఖను ముగించారు.
Also Read
- Helmet and Hair Loss: హెల్మెట్ వల్ల నిజంగా జుట్టు రాలుతుందా..? వైద్యులు చెప్పిన అసలు నిజం ఇదే..
- CM Vijay: సీఎం విజయ్‌కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
- Explained: జోక్‌గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
- Summer Foods for Kids: డీహైడ్రేషన్‌కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
తాజావార్తలు
-
KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్‌కి కేటీఆర్ లేఖ
-
Xiaomi 17T Pro, 17T: షియోమీ 17T ప్రో, 17T రిలీజ్ డేట్ ఫిక్స్!.. 7000mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Helmet and Hair Loss: హెల్మెట్ వల్ల నిజంగా జుట్టు రాలుతుందా..? వైద్యులు చెప్పిన అసలు నిజం ఇదే..
-
PEDDI Ki Aawaz: నమస్తే భోపాల్.. దసరా మైదాన్‌లో ‘పెద్ది’ దిగుతున్నాడు!
-
CM Vijay: సీఎం విజయ్‌కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!