NTV Telugu Site icon

KTR: చేయని శపథం లేదు.. ఆడని అబద్దం లేదు.. అక్షరాల 420 అబద్దపు హామీలు

Ktr

Ktr

సోషల్ మీడియా వేదికగా(ఎక్స్) కేటీఆర్ రేవంత్ సర్కార్ పై మండిపడ్డారు. రుణ‌మాఫీపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అసెంబ్లీలో చేసిన ప్రకటనపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. అధికారం కోసం కాంగ్రెస్ ఎక్కని గుడి లేదు- మొక్కని దేవుడు లేడు.. చేయని శపథం లేదు-ఆడని అబద్దం లేదు.. ఒకటా రెండా.. అక్షరాల 420 అబద్దపు హామీలు. నిండు శాసన సభ సాక్షిగా తెలంగాణ రైతన్న గుండెలపై గునపం దింపిన ఇందిరమ్మ రాజ్యం అని ఎక్స్ లో రాసుకొచ్చారు.

Also Read:Sekhar Kammula : ప్రేక్షకులకు కొత్తగా ఏదైనా చూపించాలి అనేది నా ప్రయత్నం..

చట్టసభల సాక్షిగా వరంగల్ డిక్లరేషన్ కు తూట్లు పొడిచిన కపట కాంగ్రెస్.. అధికారం కోసం అందరికి రుణమాఫీ- అధికారం దక్కాక కొందరికే రుణమాఫీ.. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టు- పెట్టెలో ఓట్లు పడ్డాయ్-జేబులో నోట్లు పడ్డాయ్-ఢిల్లీకి మూటలు ముట్టాయ్ ఇక ఇచ్చిన వాగ్దానాలు ఉంటే ఎంత గంగలో కలిస్తే ఎంత అన్నట్లుంది కాంగ్రెస్ యవ్వారం అని వెల్లడించారు. రూ.2 లక్షల వరకు కుటుంబంతో సంబంధం లేకుండా రుణమాఫీ అని ప్రకటించారు. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ అని చెబుతున్నారు. నాడు రూ. 2 లక్షలు దాటినా రుణమాఫీ అన్నారు. ఇప్పుడేమో రూ. 2 లక్షల పైబడితే మాఫీ లేదంటున్నారు. నాడు ఓట్ల కోసం హామీలు .. నేడు ఎగవేత కోసం కొర్రీలు. మిస్టర్ రాహుల్, మాఫీమాంగో తెలంగాణసే అని కేటీఆర్ వెల్లడించారు.