NTV Telugu Site icon

KTR : కేటీఆర్‌కు అంతర్జాతీయ గౌరవం

Ed Ktr

Ed Ktr

KTR : బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కే. తారక రామారావుకు (కేటీఆర్) మరో అరుదైన గౌరవం లభించింది. అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం ఇవాన్‌స్టన్ పట్టణంలో ఉన్న నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీలో ఏప్రిల్ 19, 2025న జరగనున్న కెల్లాగ్ ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ (KIBC-2025) లో కేటీఆర్ ముఖ్య అతిథిగా ప్రసంగించనున్నారు. ఈ మేరకు కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ చెనాక్షా గోరెంట్ల ప్రత్యేకంగా లేఖ ద్వారా ఆహ్వానం పంపారు.

Railway Ticket: రైల్వే కౌంటర్ టికెట్ కంటే ఆన్‌లైన్ టికెట్ ఎందుకు ధర ఎక్కువ తెలుసా..?

కేటీఆర్ తన మంత్రిత్వ కాలంలో తెలంగాణను పారిశ్రామిక, టెక్నాలజీ రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దారని KIBC నిర్వాహకులు ప్రశంసించారు. టీ-హబ్, టీ-వర్క్స్, వీ-హబ్ వంటి వినూత్న ఆవిష్కరణల ద్వారా స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి అద్భుతమైన వేదికగా తెలంగాణ నిలిచిందన్నారు. ఈ విధానాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు మోడల్‌గా నిలిచాయని చెనాక్షా గోరెంట్ల పేర్కొన్నారు.

సాంకేతిక రంగంలో హైదరాబాద్‌ను ప్రపంచ ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దడంలో కేటీఆర్ కీలక పాత్ర పోషించారని నిర్వాహకులు పేర్కొన్నారు. తెలంగాణలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ ఎకోసిస్టమ్, టెక్నాలజీ విప్లవం గురించిన విలువైన సమాచారం కోసం అమెరికాలోని బిజినెస్ స్కూల్ విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెనాక్షా గోరెంట్ల లేఖలో పేర్కొన్నారు. ఈ బిజినెస్ కాన్ఫరెన్స్‌లో భారత పారిశ్రామికత, టెక్నాలజీ రంగ అభివృద్ధిపై చర్చించనున్నారు. భారత ప్రతినిధిగా కేటీఆర్ పాల్గొనడం తెలంగాణకు మరో అంతర్జాతీయ గుర్తింపు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tamilnadu : కదులుతున్న రైలులో గర్భిణీ స్త్రీపై అత్యాచారం.. తర్వాత బయటకు తోసేశారు