తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మంత్రి కేటీఆర్ మరో సవాల్ విసిరారు. తాను డ్రగ్స్ టెస్టులు చేయించుకోవడానికి సిద్ధమని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. టెస్ట్ కోసం రాహుల్ గాంధీ వస్తే తాను కూడా రెడీ అని స్పష్టం చేశారు. చర్లపల్లి జైలు జీవితం గడిపిన వ్యక్తులు రాహుల్ గాంధీని ఒప్పించాలని… రేవంత్ రెడ్డికి చురకలంటించారు. తాను పరీక్ష చేయించుకుని క్లీన్ చిట్ తో వస్తే… రేవంత్ రెడ్డి.. తన పదవి నుంచి వైదొలుగుతానని అని సవాల్ విసిరారు కేటీఆర్. అలాగే… ఓటుకు నోటు కేసులో లైవ్ డిటెక్టర్ టెస్ట్ కు కూడా రేవంత్ రెడ్డి సిద్ధమా ? అని కేటీఆర్ ప్రశ్నించారు. కాగా… రెండు రోజుల కింద.. మంత్రి కేటీఆర్ కు రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే. అమర వీరుల స్థూపం దగ్గరకు మంత్రి కేటీఆర్ రావాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యం లోనే తాజాగా మంత్రి కేటీఆర్.. డ్రగ్స్ టెస్ట్ లకు సిద్ధమని సంచలన ట్వీట్ చేశారు.
రేవంత్ కు కేటీఆర్ మరో సవాల్..నేను డ్రగ్స్ టెస్ట్ కు సిద్దమే !
