NTV Telugu Site icon

KTR: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచినందుకు నా మీద కేసులు పెడతారా..

Ktr

Ktr

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా ఈ-రేసింగ్‌పై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోటర్ కార్ల రేసింగ్ క్రీడ ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన క్రీడ అని అన్నారు. ఫార్ములా -1 మొదటి రేసింగ్ 1946లో ఇటలీలో జరిగిందని తెలిపారు. ఈ ఫార్ములా వన్ 24 రేసింగ్‌లు నిర్వహిస్తుంది.. భారతదేశం కూడా ఫార్ములా వన్ రేసింగ్ నిర్వహించేందుకు ఎదురు చూసిందని పేర్కొన్నారు. 2003లో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడే ఈ ఫార్ములా వన్ రేసింగ్ హైదరాబాద్‌లో జరగాలని ఎంతో కష్టపడ్డారు.. కానీ 2011లో ఉత్తరప్రదేశ్‌లో ఫార్ములా వన్ రేసింగ్ నిర్వహించారని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 70, 608 కోట్ల రూపాయలతో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించారని కేటీఆర్ పేర్కొన్నారు. 2003లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రూ. 103 కోట్లతో హైదరాబాద్‌లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నిర్వహించారు.. ఇలా క్రీడల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కోట్లు ఖర్చు పెడుతుందని కేటీఆర్ తెలిపారు.

YS Jagan: అన్ని వ్యవస్థలను నీరుగార్చి నాశనం చేస్తున్నారు.. ఏపీ ప్రభుత్వంపై జగన్‌ ఫైర్

తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫార్ములా వన్ రేసింగ్ వాళ్ళను తాను కలిశానని కేటీఆర్ అన్నారు. ఫార్ములా వన్ హైదరాబాద్‌లో నిర్వహించాలని అడిగితే వాళ్ళు తిరస్కరించారు.. దీనితో ఫార్ములా ఈ రేసింగ్‌ను తాను సంప్రదించానని చెప్పారు. హైదరాబాద్ రావాలని కొట్లాడి తీసుకొచ్చాము.. దీనివల్ల ఎలక్ట్రికల్ వెహికిల్‌లపై ఇంట్రస్ట్ పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందుకే ఫార్ములా ఈ రేసింగ్ కోసం 2022 ఆగస్టులో జీవో ఇచ్చాము.. దీనికి రూ. 35 నుంచి రూ. 40 కోట్లు ఖర్చు పెట్టామని.. ప్రైవేట్ సంస్థ 100 కోట్ల ఖర్చు పెట్టిందని వెల్లడించారు. దీనివల్ల రూ. 700 కోట్ల ఆదాయం తెలంగాణకు వచ్చింది.. ఎన్నో వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. రూ. 100 కోట్ల పెట్టుబడి పెట్టిన గ్రీన్ కో నష్టం వచ్చిందని వెనక్కు తగ్గింది.. ఆ వెంటనే హెచ్ఎండీఏ (HMDA) లో ఉన్న అధికారి అరవింద్ కుమార్ తనను సంప్రదించారని పేర్కొన్నారు. రేసింగ్ కోసం ప్రభుత్వం నుంచే రూ. 55 కోట్లు ఇస్తామని చెప్పి.. తానే సంతకం పెట్టి ఇచ్చానని అన్నారు కేటీఆర్. దీనిలో అరవింద్ కుమార్‌కు ఎలాంటి ప్రమేయం లేదు.. హెచ్ఎండీఏ నిధులు కాబట్టి కేబినెట్ ఆమోదం లేకుండానే విడుదల చేసే అవకాశం ఉందని అన్నారు. దీంతో తానే రూ. 55 కోట్లు విడుదల చేయమని సంతకం పెట్టానని కేటీఆర్ పేర్కొన్నారు.

Secunderabad: గాంధీ ఆసుపత్రి ముట్టడికి యత్నించిన నర్సింగ్ విద్యార్థులు..

హైదరాబాద్ పేరు ప్రపంచ వ్యాప్తంగా చాటేందుకు ఆ నిర్ణయం తీసుకున్నానని కేటీఆర్ చెప్పారు. కానీ తన ఇంట్లోకి డబ్బులు వస్తాయని రేవంత్ రెడ్డి సీఎం కాగానే క్యాన్సల్ చేశాడని ఆరోపించారు. ఇప్పుడు దానిపై ఏసీబీ (ACB) కేసు పెడతాం అంటున్నారు.. అసలు ఏసీబీ అంటే రేవంత్ రెడ్డికి మీనింగ్ తెలుసా అని ప్రశ్నించారు. ఇక్కడ ఏమైనా కరప్షన్ జరిగిందా.. కేస్ పెడితే పెట్టండి.. ఇక్కడ చెప్పిందే అక్కడ చెప్తానన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచినందుకు తన మీద కేసులు పెడతారా అని అన్నారు. అటెన్షన్ డైవర్షన్ కోసం రేవంత్ రెడ్డి ఇవన్నీ చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు. తనను అరెస్ట్ చేస్తే చేసుకోమన్నారు. రెండు మూడు నెలలు జైల్లో పెడితే హ్యాపీగా వెళతాను.. హ్యాపీగా యోగా చేసుకొని వస్తానని పేర్కొన్నారు. తనకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు రాలేదని కేటీఆర్ చెప్పారు. రాజ్ భవన్ లో బీజేపీ, కాంగ్రెస్ కలిసి ప్లాన్ చేస్తున్నాయి.. గవర్నర్ అనుమతి ఇస్తే.. ఆయన విచక్షణకే వదిలేస్తామని కేటీఆర్ తెలిపారు.

Show comments