NTV Telugu Site icon

KTR : జగిత్యాలను జిల్లా చేసింది.. మెడికల్ కాలేజీ తీసుకువచ్చింది కేసీఆర్

Ktr

Ktr

జగిత్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హల్‌లో బీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మాజీమంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్‌ తో పాటు బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, జడ్పీ చైర్మన్ వసంత, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ , ఎమ్మెల్సీ రమణ, 18 మండలల నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. జగిత్యాలలో ఈ హౌలే గాన్ని ఎమ్మెల్యేను చేసింది ఎవరు..? జగిత్యాలను జిల్లా చేసింది మెడికల్ కాలేజీ తీసుకువచ్చింది కేసీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి జిల్లాను మెడికల్ కాలేజీని రద్దు చేస్తామన్న పార్టీలోకి సంజయ్ కుమార్ వెళ్ళాడని, సొంత ప్రయోజనాలు నాలుగు డబ్బులు సంపాదించుకునేందుకే పార్టీ మారాడు సంజయ్ అని ఆయన ధ్వజమెత్తారు. జగిత్యాల ఎమ్మెల్యే బండగట్టుకుని బాయిల దూకి ఆత్మహత్య చేసుకున్నాడని, గాలికి గడ్డపారలు కొట్టుకుపోవు గడ్డి పోచలే కొట్టుకుపోతాయన్నారు కేటీఆర్‌. పార్టీ మారిన సంజయ్ కుమార్ దమ్ముంటే రాజీనామా చేసి పోటికి రావాలని, గతంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు అందరూ రాజ్యాంగబద్ధంగానే చేరారని, సింగరేణి ప్రైవేటు పరం చేయబోమని రాహుల్ గాంధీ చెప్పారన్నారు.

అంతేకాకుండా..’సాక్షాత్తు డిప్యూటీ సీఎం బట్టి సమక్షంలోనే బొగ్గు గనులు వేలం. 420 హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. హామీల నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు. కాంగ్రెస్ పెన్షన్ల పెంపు జరగలేదు, కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఇవ్వలేదు.. గృహలక్ష్మి అమలు చేయలేదు.. అసెంబ్లీ ఎన్నికల్లో మూడో వంతు సీట్లు గెలిచాం.14 చోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాం. 2014 తర్వాత మన ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డే. రేవంత్ రెడ్డికి దమ్ముంటే పార్టీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ పోటీ చేయాలి. మోడీ కావాలా వద్దా అని నినాదంతో మాత్రమే పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. కాబట్టే బలమైన ప్రాంతీయ పార్టీలన్నీ వెనుకబడ్డాయి. కూటమిలో లేని పార్టీలు అన్నింటికీ ఒకే రకమైన ఫలితాలు వచ్చాయి. 50 లక్షల రూపాయలతో రేవంత్ ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయాడు.

కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఇతర పార్టీలోకి వెళ్లిన వాళ్లను రాళ్లతో కొట్టి చంపాలని రేవంత్ రెడ్డి అన్నారు. మరి అలాంటిది బిఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్లను ఎందుకు తీసుకుంటున్నారు. సంజయ్ కుమార్ క్రషర్ కాడ కూర్చుని కంకర ఏరుకుంటూ ఉండాలి.. స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఒక్క టికెట్ కూడా సంజయ్ వర్గానికి జీవన్ రెడ్డి ఇవ్వనీయడు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా 2లక్షల రుణమాఫీ కాలేదు. రైతు భరోసా 15000 ఇస్తామని ఇవ్వలేదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తారని ఫిరాయింపులకు తెరలేపిన సీఎం రేవంత్.’ అని కేటీఆర్‌ అన్నారు.