KTR : చివరికి ఈసీ కూడా బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ పై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుందని, ఎన్నికల కమిషన్ బీజేపీ కనుసన్నల్లో నడుస్తోందని విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టే విదంగా మాట్లాడుతుందని, బీజేపీ సోషల్ మీడియా లో ముస్లింల ను టార్గెట్ చేస్తూ ప్రచారం చేస్తున్నారని, నరేంద్ర మోడీ ముస్లిం ల పిల్లల పై విద్వేష పూరిత వ్యాఖ్యలు చేశారన్నారు. కానీ ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు కేటీఆర్. కేసీఆర్ విషయం లో ఆఘమేఘాల మీద నోటీస్ లు ఇచ్చారని, కేసీఆర్ సిరిసిల్లలో రైతుల దగ్గరకు వెళ్ళినప్పుడు మీడియా తో మాట్లాడారని, నేతన్నల తరుపున కొంచెం పరుష పదజాలం తో మాట్లాడారన్నారు. దీనికే నోటీసులు ఇచ్చారని, సీఎం రేవంత్ రెడ్డి ఇంకా తీవ్ర స్థాయిలో మాట్లాడారని, మేము ఇప్పటి వరకు 9 సార్లు రేవంత్ రెడ్డి పై కంప్లైంట్ ఇచ్చామని తెలిపిన కేటీఆర్.. మొత్తం 27 కంప్లైంట్ లు ఇచ్చామన్నారు. అయినా ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, బడాబాయ్ , చోటాబాయ్ లపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదన్నారు. 48 గంటలు కేసీఆర్ ను తాత్కాలికంగా ఆపగలరని, కానీ ఓట్లు వేసే జనాలను ఆపలేరని కేటీఆర్ అన్నారు.
అంతేకాకుండా..’ఉస్మానియా యూనివర్సిటీ లో చీఫ్ వార్డెన్ ఒక సర్కులర్ విడుదల చేశారు. మార్చ్18 న తీవ్రమైన నీటి ఎద్దడి, విద్యుత్ సమస్య ఉందని హాస్టల్ మూసి వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయం కేసీఆర్ ట్వీట్ చేశారు. ఆ వెంటనే ప్రభుత్వం ఆఘమేఘాల మీద స్పందించింది. సీఎం రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా గత ఏడాది కూడా ఇలాగే నీళ్లు, విద్యుత్ లేదని హాస్టల్ లు మూసి వేశారు అని ఫేక్ డాక్యుమెంట్ పెట్టారు. ఒక సీఎం అయి ఉండి తన వ్యక్తిగత అకౌంట్ ద్వారా తప్పు డాక్యుమెంట్ పెట్టారు. ఫోర్జరీ డాక్యుమెంట్ తో రేవంత్ రెడ్డి ప్రజలను తప్పు దోవ పట్టించారు. ఇది ఫోర్జరీ డాక్యుమెంట్ కాదు అని నిరూపిస్తే నేను చంచల్ గూడ జైల్ కు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్ అయితే మీరు చంచల్ గూడ జైల్ కు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా. తప్పు చేయని మా పార్టీ నేత క్రిశాంక్ పై అక్రమ కేసులు పెట్టారు. మేము తప్పుడు కేస్ లకు భయపడము. క్రిశాంక్ పై ఉన్న తప్పుడు కేస్ లను ఉపసంహరించుకోవాలి.’ అని కేటీఆర్ అన్నారు.
Also Read
- AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- Tags
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఎండల సెగ.. నీటి కష్టాలు.? రైతులకు సీఎం అలర్ట్
-
Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!